Fenugreek Tea: మెంతి గింజలు శరీరాని చాలా ప్రయోజనాలను ఇస్తాయి. అంతే కాకుండా వీటితో చేసిన టీ తాగడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మెంతి గింజల్లో యాంటాసిడ్ స్థాయి అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో యాసిడ్ రిఫ్లెక్స్ ను ప్రభావితం చేస్తుంది. ఈ టీ గాయాలతో బాధపడుతున్న వారికి యాంటిబెటిక్‌గా పనిచేస్తుంది. అంతేకాకుండా మెంతుల్లో ఉండే గుణాలు శరీరానికి అనేక లాభాలను కలిగిస్తుంది. కాబట్టి మెంతి టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
బరువు తగ్గడానికి ప్రయోజనకరంగా ఉంటుంది:
మెంతులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కావున మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాకుండా మెంతి టీ తాగడం వల్ల కడుపులో రాళ్ల సమస్య దూరమవుతుంది. ముఖ్యంగా బరువు తగ్గలనుకుంటున్న వారు ఈ టీ తాగడం వల్ల బరువు తగ్గోచ్చని నిపుణులు చెబుతున్నారు.
షుగర్ లెవెల్‌ను అదుపులో ఉంచుతుంది:
మీడియా నివేదికల ప్రకారం...మెంతి గింజలలో చాలా పోషకాలుంటాయి. కావున ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ పరిమాణం పెరగకుండా నిరోధిస్తుంది.
మెంతి టీ ఎలా తయారు చేయాలో తెలుసుకోండి:
మెంతి టీ తయారు చేయడానికి..ముందుగా ఒక చెంచా మెంతి పొడిని తీసుకొని వేడి నీటిలో కలపండి. ఆ తర్వాత మెంతులను వడకట్టాలి. ఇలా వడకట్టిన తర్వాత పానీయంలో నిమ్మరసాన్ని కలపండి. దానికి కొంచెం తేనె కలిపి తాగండి.
(NOTE: ఈ కథనం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ దావా లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మరిన్ని వివరాల కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.)
Also Read: Thyroid Control Juice: ఈ మూడు జ్యూస్‌లు తాగండి..థైరాయిడ్ నుంచి ఉపశమనం పొందండి.!!
Also Read: Benefits Of Sea Salt: సముద్రపు ఉప్పు వల్ల జుట్టుకు ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా.!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook