Foot Massage Benefits: చాలా మంది సాధారణంగా వేడి నూనెతో నొప్పుల క్రమంలో మాత్రమే మసాజ్ చేసుకుంటూ ఉంటారు. అయితే చలి కాలంలో మాత్రం పిల్లల నుంచి వృద్ధుల దాకా పాదాలు, అరికాళ్లకు మసాజ్ చేసుకుంటున్నారు. అయితే ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. చలికాలంలో పాదాలకు వేడి నూనెతో మసాజ్ చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఆవాలు, కొబ్బరి నూనె మసాజ్ చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ సమస్యల నుంచి ఉపశమనం:
నొప్పుల నుంచి ఉపశమనం:
చలికాలంలో పాదాలు, కీళ్ల నొప్పుల సమస్యలు పెరుగుతూ ఉంటాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పాదాలకు ఆయిల్‌తో మసాజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎముకలు, కండరాల నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
రక్త ప్రసరణ మెరుగు పడుతుంది:
చలికాలంలో రక్తప్రసరణ సమస్యలు వస్తూ ఉంటాయి. దీని ప్రధాన కారణంగా వాతావరణంలో తేమ పెరగడమేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే గోరువెచ్చని నూనెతో పాదాలకు మసాజ్ చేస్తే రక్తప్రసరణ మెరుగవుతుంది. కాబట్టి పాదాలకు చలి కాలంలో ప్రతి రోజూ మసాజ్ చేయాల్సి ఉంటుంది.
చర్మం మృదువుగా మారుతుంది:
గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయడం వల్ల పాదాలకు చర్మానికి ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా మసాజ్ చేయడం వల్ల మడమల పగుళ్ల సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి.
నిద్రలేమి సమస్యలు:
పాదాలకు ఆయిల్‌తో మసాజ్ చేయడం వల్ల అలసట కూడా సులభంగా తగ్గుతుంది. దీంతో నిద్ర లేమి సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా పాదాలకు ఆయిల్‌తో మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Ind Vs Ban: బంగ్లాతో రెండో టెస్టుకు ముందు బ్యాడ్‌న్యూస్.. ఇద్దరు ప్లేయర్లు ఔట్
Also Read: Ap Rains: ఏపీకి మళ్లీ వర్ష సూచన.. ఈ ప్రాంతాలపై ఎఫెక్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook