Heavy Rains In Ap: ఏపీని వర్షం ముప్పు వీడటం లేదు. మధ్య దక్షిణ బంగాళాఖాతంలో తూర్పు భూమధ్యరేఖ ప్రాంతానికి ఆనుకుని హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇది స్థిరంగా కొనసాగుతోందన్నారు. రాగల 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశలో నెమ్మదిగా కదులుతూ... శ్రీలంక తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ అల్ప పీడన ప్రభావరం ఆంధ్రప్రదేశ్‌పై స్వల్పంగా ఉంటుందన్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి 28 వరకు రాయలసీమ, దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్రంపైకి ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయన్నారు.
అల్పపీడన ప్రభావం తమిళనాడు తీర ప్రాంత జిల్లాల్లోపై కూడా ఉండనుంది. నేటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, యానంలలో దిగువ ట్రోపోస్పిరిక్ ఆవరణములలో ఈశాన్య/తూర్పు గాలులు వీస్తాయి. దక్షిణ బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న తూర్పు భూమధ్యరేఖ మధ్య భాగాలపై అల్పపీడన ప్రాంతం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనంతో హిందూ మహాసముద్రం మిడ్ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు కొనసాగుతుంది. ఇది రానున్న 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా శ్రీలంక తీరం వైపు వెళ్లే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రము అధికారులు తెలిపారు. పగటి సమయాల్లో మంచు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని చెప్పారు. రాత్రి సమయాల్లో చలి ఎక్కువగా ఉండనుందన్నారు. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతాలను ఉదయం మంచు కప్పేస్తుండగా.. కోస్తా, రాయలసీమలోని పలుచోట్ల చలి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.
వర్షాకాలం చివరి దశకి వచ్చేయడంతో రానున్న రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. శ్రీలంకకి దగ్గరగా వస్తున్న అల్పపీడన ప్రభావంతో ఈ నెల 22 నుంచి 28 మధ్య కాలంలో తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయన్నారు. ఇతర జిల్లాల్లో తేలికపాటి జల్లులు లేదా వర్షాలు ఏమి ఉండవన్నారు.
Also Read: Jammu And Kashmir Encounter: ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు.. భారీ ఎన్‌కౌంటర్‌లో హతం
Also Read: Mohan Babu : పోలీసులు అధికారంలో ఉన్నవారికి తొత్తులు.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook