Ind Vs Ban: బంగ్లాతో రెండో టెస్టుకు ముందు బ్యాడ్‌న్యూస్.. ఇద్దరు ప్లేయర్లు ఔట్

India Vs Bangladesh 2nd Test Match: బంగ్లాతో రెండో టెస్టుకు ముందు టీమిండియాకు బ్యాడ్‌న్యూస్. ఇద్దరు కీలక ఆటగాళ్లు జట్టు నుంచి వైదొలిగారు. ఈ మేరకు బీసీసీఐ నుంచి ప్రకటన వచ్చింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 20, 2022, 02:42 PM IST
Ind Vs Ban: బంగ్లాతో రెండో టెస్టుకు ముందు బ్యాడ్‌న్యూస్.. ఇద్దరు ప్లేయర్లు ఔట్

India Vs Bangladesh 2nd Test Match: బంగ్లాదేశ్‌తో మొదటి టెస్టులో విజయం సాధించిన టీమిండియా రెండో టెస్టుకు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిస్తే.. 2-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌ స్వీప్ చేస్తుంది. ఈ నెల 22న ఢాకా వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ఇద్దరు విన్నింగ్ ప్లేయర్లు హఠాత్తుగా దూరమయ్యారు. ఇందుకు సంబంధించి బీసీసీఐ నుంచి పెద్ద అప్‌డేట్ వచ్చింది.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎడమ బొటన వేలికి గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతం రోహిత్ శర్మ బీసీసీఐ వైద్య బృందం సంరక్షణలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ బొటన వేలికి గాయమైంది. మరో ఆటగాడు నవదీప్ సైనీ రెండో టెస్టు కూడా ఉదర కండరాల నొప్పి కారణంగా  దూరమయ్యాడు.

హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ బొటన వేలి గాయం పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం అవసరమని బీసీసీఐ వైద్య బృందం అభిప్రాయపడింది. రోహిత్ శర్మ మునుపటిలా బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో అద్భుతమైన ఆటను కనబరచాలంటే కొద్ది రోజులు విశ్రాంతి తప్పదన్నారు. దీంతో బంగ్లాదేశ్‌తో జరిగే రెండో, చివరి టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులో ఉండడు. ఉదర కండరాల నొప్పి కారణంగా నవదీప్ సైనీ రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు. ఈ ఫాస్ట్ బౌలర్ ప్రస్తుతం ఎన్‌సీఏలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

ఇటీవల గాయం నుంచి కోలుకుని రోహిత్ శర్మ మళ్లీ మైదానంలోకి దిగుతున్నాడని వార్తలు వచ్చాయి. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు ఆడేందుకు రెడీ అవుతున్నాడని కూడా ప్రచారం జరిగింది. కానీ అవన్నీ పుకార్లేనని బీసీసీఐ ప్రకటనలో తేలిపోయింది. హిట్‌మ్యాన్‌ను మైదానంలోకి చూసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. 

రెండో టెస్టుకు టీమిండియా: 

కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, అభిమన్యు ఈశ్వరన్, సౌరభ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్.

Also Read: Delhi acid attack case: ఢిల్లీ యాసిడ్ దాడి కేసులో కీలక వివరాలు చెప్పిన ఫ్లిప్‌కార్ట్

Also Read: Jammu And Kashmir Encounter: ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు.. భారీ ఎన్‌కౌంటర్‌లో హతం  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News