30 kg Oranges in 30 minutes: చైనాలో ఓ విచిత్రం జరిగింది. ముగ్గురు కలిసి ఎయిర్ పోర్ట్‌కు వెళ్లారు. లగేజ్ బరువెక్కుపోయింది. లగేజ్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలా అని ఆలోచించారు. అంతే ఠక్కున..30 కిలోల బత్తాయి పంఢ్లు లాగించేశారు..ఆశ్చర్యంగా ఉందా నిజమే..
అమ్మో అన్ని తెలివి తేటలే..అని ఒకరు, ఇన్ని తెలివి తేటలెక్కడ్నించి వచ్చేశాయి అని మరొకరు, మీ కక్కుర్తి మండిపోనూ అని ఇంకొకరు..ఇలా ఇష్టమొచ్చినట్టుగా ఫన్నీ కామెంట్లు పెట్టేస్తున్నారు. ఎందుకో తెలుసా. చైనా ( China ) లో వాంగ్ అనే వ్యక్తి ముగ్గురు స్నేహితులతో కలిసి విమానాశ్రయానికి ( Airport ) వెళ్లాడు. నిర్ణీత లగేజ్ కంటే ఎక్కువ బరువుంది. ఎయిర్ పోర్ట్ నిబంధనల ప్రకారం అధిక బరువుకు డబ్బులు చెల్లించాల్సి ఉంది. భారతీయ కరెన్సీ ప్రకారం 3 వేల 384 రూపాయలు చెల్లించాల్సి ఉంది. అంత డబ్బు చెల్లించాలా అని ఆలోచించారు. వెంటనే ఓ ఉపాయం ఆలోచించారు. డబ్బులు కట్టే బదులు..లగేజ్ బరువు ( Extra luggage ) తగ్గించుకుంటే చాలు కదా అని ఆలోచించారు.
అంతే వెంటనే బ్యాగ్స్ తెరిచారు. బ్యాగ్స్‌లో ఉన్న 30 కిలోల బత్తాయి పండ్ల ( 30 kg Oranges in 30 Minutes ) ను నలుగురూ కలిసి తినడం ప్రారంభించారు. కేవలం అరగంట వ్యవధిలోనే మొత్తం పండ్లన్నీ తినేశారు. అంతే బ్యాగ్ ఖాళీ అయింది. బరువు తగ్గిపోయింది. డబ్బులు కట్టకుండా పనైపోయిందనే ఆనందం కాస్సేపట్లో ఆవిరైపోయింది. ఒకేసారి పెద్దమొత్తంలో బత్తాయి పండ్లు తినడంతో నోటి పూత ఏర్పడి..ఆసుపత్రి పాలయ్యారు. అందుకే ఈ ఫన్నీ కామెంట్లు.
Also read: Effects Of Alcohol: మద్యం సేవించే సమయంలో ఈ పదార్ధాలు అసలు తినకూడదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook