Ghee Benefits For Skin: నెయ్యిని ఎప్పుడైనా ఫేస్ ప్యాక్‌లా వాడారా.. దీనితో బోలెడు లాభాలు..

How To Use Ghee For Skin Whitening: ప్రస్తుతం చాలామంది చర్మం నిగారింపు కోసం మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన ప్రొడక్ట్స్ ను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు వీటిని వినియోగించడం వల్ల అనేక రకాల సమస్యల బారిన పడుతున్నారు. అయితే వీటికి బదులుగా ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ హోమ్ రెమెడీస్ ని వినియోగించండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 5, 2023, 05:42 PM IST
Ghee Benefits For Skin: నెయ్యిని ఎప్పుడైనా ఫేస్ ప్యాక్‌లా వాడారా.. దీనితో బోలెడు లాభాలు..

How To Use Ghee For Skin Whitening: ముఖం అందంగా, కాంతివంతంగా మెరిసేలా ఉండడానికి ప్రస్తుతం చాలామంది మార్కెట్లో లభించే ఫేస్ వాష్ లు, ఖరీదైన సబ్బులు, ఫేస్ క్రీమ్స్ వంటి అనేక రకాల రసాయనాలతో కూడిన ప్రొడక్ట్స్ ను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. మరి కొంతమంది అయితే ఖరీదైన చికిత్సలను కూడా చేయించుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల ముఖం అందంగా తయారైనప్పటికీ కొన్ని రోజులవరకే వీటి ప్రభావం ఉంటుందని.. ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రసాయనాలతో కూడిన ప్రొడక్షను ఎక్కువగా వినియోగించడం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వీటికి బదులుగా ఆయుర్వేద ని గుణాలు సూచించిన కొన్ని హోమ్ రెమెడీస్ ని వినియోగించడం చాలా మంచిది. వీటిని వినియోగించడం వల్ల సాధారణంగా, శాశ్వతంగా చర్మంపై మెరుపు పొందుతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ముఖాన్ని అందంగా చేసేందుకు మెరిపించేందుకు నెయ్యి ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నెయ్యిలో ఉండే ఔషధ గుణాలు చర్మాన్ని డ్యామేజ్ నుంచి ఉపశమనం కలిగించి శాశ్వతంగా మెరిపించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి మార్కెట్లో లభించే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కి బదులుగా నెయ్యితో తయారుచేసిన ఫేస్ లోషన్ వినియోగించడం చాలా మంచిది. అయితే ఈ లోషన్ ఎలా తయారు చేసుకోవాలో? ఈ లోషన్ వినియోగించడం వల్ల కలిగే లాభాలు ఏంటో? మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం.

ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి

ముందుగా ఈ లోషన్ ని తయారు చేసుకోవడానికి ఒక చిన్న గిన్నెను తీసుకోవాల్సి ఉంటుంది ఆ గిన్నెలో నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కరిగించుకోవాలి. ఆ తర్వాత మూడు టేబుల్ స్పూన్ల కలబంద జెల్ ని వేసి ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు గంటల పాటు పక్కన పెట్టుకొని.. ఒక సీసాలో భద్రపరచుకొని ఉదయం పూట ముఖానికి అప్లై చేసి.. అరగంట పాటు అలాగే ఉంచుకొని శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఇలా క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల చర్మం నిరవడమే కాకుండా శాశ్వతంగా నిగనిగలాడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అనేక రకాల చర్మ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.

ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News