Health Care Tips: ప్రస్తుతం చాలా మంది బీజి లైఫ్ కారణంగా ఆరోగ్యంపై అనేక రకాల సమస్యలు ప్రభావం చూపుతున్నాయి. మారుతున్న జీవన శైలి కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఉండటానికి, శారీరకంగా చురుకుగా ఉండటం చాలా ముఖ్యం. ప్రస్తుతం చాలా మంది ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోతారు. దీని వల్ల ఆహారం సరిగా జీర్ణం కాక, జీర్ణవ్యవస్థ బలహీనపగుతుంది. కావున ఆహారం తీసుకున్న తరువాత 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని చిట్కాలను ఉపయోగించి మిమ్మల్ని మీరు ఎలా ఫిట్‌గా ఉంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆహారం తిన్న తర్వాత ఈ వ్యాయామం చేయండి:
నడవడం (walk):
రోజూ నడవడం కూడా ఒక రకమైన వ్యాయామమే. రోజూ నాలుగు నుంచి ఐదు కీ.మీ నడిస్తే.. శారీరకంగా చురుకుగా ఉండగలుగుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అందుకే ఆహారం తిన్న తర్వాత నడవడం మంచిది. ఇలా చేయడం వల్ల ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. జీర్ణవ్యవస్థపై పెద్దగా ఒత్తిడి ఉండదు.
అడ్మింటైన్ పోజ్(admintine) :
ఆహారం తిన్న తర్వాత అడ్మింటైన్ భంగిమలో కూర్చోవడం ద్వారా ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. భోజనం తర్వాత ఇది ఉత్తమ వ్యాయామంగా ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొంది.
సుఖాసనం(Sukhasana) :
సుఖాసనంలో కూర్చుంటే కూడా ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. కానీ తిన్న తర్వాత సుఖాసనంలో 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే కూర్చోవాలి. దీని తర్వాత మీరు నడవాలి. ఇలా చేయడం వల్ల మీ శరీరంలో ఎనర్జీ లెవెల్ పెరుగుతాయి. అంతేకాకుండా రోజంతా చురుకుగా ఉంటారు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: High Cholesterol Sing On Face: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి..!
Also Read: Pomegranates For Mens: లైంగిక సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఈ పండ్లను తినండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook