Blackheads Tips: ముఖ్యంపై బ్లాక్‌హెడ్స్ అనేవి అందానికి మచ్చల్లాంటివి. మొత్తం అందంపై ప్రభావం చూపిస్తాయి. కారణాలు ఏమైనప్పటికీ ఇటీవలి కాలంలో బ్లాక్‌హెడ్స్ సమస్య పెరిగిపోయింది. అయితే కొన్ని సులభమైన హోమ్ రెమిడీస్ సహాయంతో ఈ సమస్యను చిటికెలో పరిష్కరించవచ్చంటున్నారు.
ముఖ చర్మం సాధారణంగా ఆయిలీగా ఉంటుంది. ఇందులో ముక్కు, గెడ్డం భాగంలో ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. దాంతో దుమ్ము ఎక్కువగా పేరుకుంటుంది. దాంతో బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ సమస్య ఉత్పన్నం కావచ్చు. ముఖంపై బ్లాక్‌హెడ్స్ ఉంటే మొత్తం అందం పాడవుతుంది. క్రమంగా పింపుల్స్ సమస్యకు దారి తీస్తుంది. బ్లాక్‌హెడ్స్ అనేవి సాధారణంగా ముక్కు భాగంలో ఎక్కువగా ఉంటాయి. ముక్కుపై ఉండే బ్లాక్‌హెడ్స్ చర్మం లోపల్నించి ఉండటం వల్ల అంత సులభంగా పోవు. చర్మంలోని డెడ్‌సెల్స్‌లో ఆయిల్ చేరితే చర్మంపై చిన్న చిన్న గింజల్లాంటివి వస్తాయి. బయట వాతావరణంలో గాలి తగిలినప్పుడు నల్లబడతాయి. ఇవే బ్లాక్ హెడ్స్‌గా కన్పిస్తాయి. కొన్ని చిట్కాలతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
బ్లాక్‌హెడ్స్ నిర్మూలనలో ఇది అత్యంత సులభమైన పద్థతిగా చెప్పవచ్చు. అరటి పండు తిన్న తరువాత తొక్క పాడేయకుండా చర్మానికి రాసుకోవాలి. తొక్క లోపలి భాగంతో చర్మాన్ని రుద్దడం వల్ల బ్లాక్‌హెడ్స్ సమస్య నెమ్మదిగా పోతుంది. ఇక మరో విధానం గ్రీన్ టీ. బ్లాక్‌హెడ్స్ తొలగించేందుకు గ్రీన్ టీ అద్భుతంగా పనిచేస్తుందంటున్నారు బ్యూటిషియన్లు. 1 స్పూన్ గ్రీన్ టీ ఆకుల్ని నీళ్లలో కలిపి ముఖానికి బాగా రాసుకోవాలి. ముఖ్యంగా బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట రాయాలి. 20 నిమిషాలుంచి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే త్వరగానే బ్లాక్ హెడ్స్ సమస్య పోతుంది.
బ్లాక్‌హెడ్స్ సమస్యను పోగొట్టేందుకు మరో విధానముంది. ఈ విధానాన్ని అనుసరిస్తే బ్లాక్‌హెడ్స్ పోగొట్టవచ్చు. చర్మంపై ఉండే వ్యర్ధాల్ని, తొలగించి డెడ్‌సెల్స్ తొలగించవచ్చు. వారంలో కనీసం 1-2 సార్లు టూత్ పేస్ట్‌తో చర్మానికి ఎక్స్‌ఫోలియేట్ చేయాలి. టూత్‌పేస్ట్ చర్మానికి రాసి కాస్సేపు వదిలేయాలి. దీనివల్ల బ్లాక్‌హెడ్స్ బయటికొచ్చేస్తాయి. కాటన్ తీసుకుని ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
బ్లాక్‌హెడ్స్ నిర్మూలించేందుకు బేకింగ్ సోడా, నిమ్మరసం మరో అద్భుతమైన విధానంగా పరిగణిస్తారు. ఒక స్పూన్ బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని గోరువెచ్చని నీళ్లలో కరిగించాలి. దీనికి బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట రాసి తేలిగ్గా మసాజ్ చేసుకోవాలి. కాస్సేపు ఉంచి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. బ్లాక్‌హెడ్స్ తొలగించేందుకు కళ్లుప్పు రోజ్ వాటర్ మరో అద్భుతమైన విధానం. ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ రోజ్ వాటర్ తీసుకుని కలుపుకోవాలి. బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట రుద్దుకోవాలి. దీంతో బ్లాక్‌హెడ్స్ తొలగడమే కాకుండా రోజ్ వాటర్ కారణంగా ముఖానికి నిగారింపు వస్తుంది.
ముల్తానీ మిట్టీ, తేనె, నిమ్మరసంతో కూడా ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. బ్లాక్‌హెడ్స్ తొలగించేందుకు ఈ మూడింటినీ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. కాస్సేపు అలానే ఉంచి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 3-4 సార్లు చేస్తే మంచి ఫలితాలుంటాయి.
Also read: Healthy Foods: డైట్‌లో ఈ మూడు పదార్ధాలుంటే చాలు..లివర్ అద్భుతంగా పని చేస్తుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook