Belly Fat: ప్రతి మనిషి ఫిట్ అండ్ స్లిమ్‌గా ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తదు. పోటీ ప్రపంచంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా అధిక బరువు, స్థూలకాయం, బెల్లీ ఫ్యాట్ వంటి సమస్యలు ఎదురౌతున్నాయి. ఇవాళ మనం చర్చించుకునేది బెల్లీ ఫ్యాట్ సమస్య గురించి. బెల్లీ ఫ్యాట్‌పై జరిపిన అధ్యయనాల్లో ఆసక్తి కల్గించే అంశాలు కూడా వెలుగు చూశాయి.
ఆహారపు అలవాట్లు, జీవన శైలి సరిగ్గా లేకపోవడం వల్లనే అన్ని సమస్యలు తలెత్తుతుంటాయి. ఇందులో అతి ముఖ్యమైంది బెల్లీ ఫ్యాట్ సమస్య. పొట్ట చుట్టూ కొవ్వు పెరిగిపోతుండటం వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. ఫిట్‌నెస్‌కు ఆటంకం కల్గిస్తుంది. నలుగురిలో అసౌకర్యంగా ఉంటుంది. ఎలాంటి డ్రెస్ వేసుకోవాలన్నా ఇబ్బందిగా మారుతుంటుంది. ఈ సమస్య నుంచి విముక్తి పొందడం అంత సులభం కాదు. బెల్లీ ఫ్యాట్‌కు ప్రధానంగా ఐదు కారణాలున్నాయని తెలుస్తోంది.
బెల్లీ ఫ్యాట్ ఎందుకొస్తుంది
అన్నింటి కంటే ముఖ్యమైన కారణం ఇది. జీవనశైలి సరిగ్గా లేకపోవడం. అంటే రోజుకు మనిషికి కావల్సిన 7-8 గంటల రాత్రి నిద్ర లేకపోవడం. ఇది లేకపోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ సమస్య వెంటాడుతుంది. మీక్కూడా రోజూ సమయానికి నిద్ర పట్టకపోతే క్యామోమైల్ టీలో కొద్దిగా దాల్చినచెక్క పౌడర్ కలుపుకుని తాగితే మంచి నిద్ర పట్టవచ్చు.
మనిషి శరీరంలో గుండె, కిడ్నీలకు ఎంత ప్రాముఖ్యత ఉందో లివర్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. లివర్ పనితీరు సరిగ్గా లేకపోతే చాలా రోగాలు ఎదురౌతాయి. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ సమస్య వెంటాడుతుంది. అందుకే లివర్ పనితీరు మెరుగుపర్చుకునేందుకు వారంలో ఓసారి లివర్ డీటాక్స్ చేయడం చాలా అవసరం. దీనికోసం ప్రతి రోజూ ఉదయం నిమ్మ నీళ్లను తాగితే మంచి ఫలితాలుంటాయి. లివర్ సదా ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే లివర్ పనితీరు మెరుగుపడుతుంటే సహజంగానే చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టేయవచ్చు.
ఇక చాలా మందికి ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉండాలన్పిస్తుంటుంది. అది ఆకలి వల్ల కావచ్చు లేదా అదో రకమైన అలవాటు కావచ్చు. ఇది మంచి అలవాటు కానే కాదు. ఈ అలవాటు వల్ల బెల్లీ ఫ్యాట్ సమస్య ఉత్పన్నమౌతుంది. ముందుగా చేయాల్సింది ఆకలి తగ్గించడం లేదా తినకుండా నియంత్రించుకోవడం. ఇలా చేయాలంటే కావల్సింది ప్రోటీన్లు. రోజుకు తగిన పరిమాణంలో ప్రోటీన్లు ఉంటే ఆకలి తగ్గించుకోవచ్చు.ఇక శరీర బరువు కూడా తగ్గించుకోవాలి. బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం ఎంత ఉండాలో చెక్ చేసుకుని అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇది జరగాలంటే మీ డైట్‌లో మార్పు అవసరం. ముఖ్యంగా ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ నుంచి ఈ మార్పు ప్రారంభమవాలి. అప్పుడే అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
Also read: Health Tips: మీ డైట్‌లో ఈ పదార్ధాలుంటే చాలు వృద్ధాప్య లక్షణాలకు చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook