Dry Cough Home Remedies: శీతాకాలంలో వాతావరణంలో తేమ తీవ్ర భారీగా పెరుగుతుంది. దీని కారణంగా చాలా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ వాతావరణంలో తీవ్ర మార్పులు సంభవించడం వల్ల దగ్గు సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఈ క్రమంలో శరీరంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా చాలా మందిలో నీరసం, చిరాకు వంటి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఇంటి చిట్కాలను వినియోగించాలని నిపుణులు తెలుపుతున్నారు.
పొడి దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి ఈ చిట్కాలను వినియోగించండి:
1. వేడి నీటిలో తేనె వేసుకుని తాగండి:
శీతాకాలంలో అస్సలు కోల్డ్ వాటర్ తాగకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే వీటికి బదులుగా వేడి నీటిని తీసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా సీజనల్ వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి వేడి నీటిలో తేనె కలుపుకుని తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ వాటర్‌ను క్రమం తప్పకుండా తాగితే శరీరాన్ని అన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
2. అల్లం, ఉప్పు:
అల్లం అనేది తరచుగా మార్కెట్‌లో లభిస్తుంది. అంతేకాకుండా ఇది వంట రుచిని పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి దీనిని తరచుగా వంటకాల్లో వినియోగిస్తారు. అంతేకాకుండా జలుబుకు దివ్యౌషధంలా పని చేస్తుంది. అయితే సీజనల్ వ్యాధులతో బాధపడేవారు అల్లం రసాన్ని తీసి అందులో తగినంత ఉప్పువేసుకుని తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
3. నల్ల మిరియాలు:
నల్ల మిరియాలు శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రభావవంతంగా పని చేస్తుంది. అయితే సీజనల్ వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తేనెలో నల్ల మిరియాల పొడిని వేసి తాగితే సులభంగా వాటికి చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Virat Kohli: నా హృదయంలో ఆ రోజుకు ప్రత్యేక స్థానం.. విరాట్ కోహ్లీ పోస్ట్ వైరల్
Also Read: Baba Ramdev: మహిళలు దుస్తులు లేకపోయినా అందంగా ఉంటారు.. బాబా రామ్‌దేవ్ కాంట్రవర్సీ కామెంట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook