Tips to Become Rich: డబ్బు సంపాదించి సమాజంలో ధనవంతులుగా బతకాలనేది ప్రతి ఒక్కరి కల. డబ్బు కోసమే రేయింబవళ్లు కష్టపడుతుంటారు. సమాజంలో డబ్బుకు ఉన్న విలువ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీ వద్ద డబ్బు ఉంటే.. దక్కే గౌరవం కూడా వేరుగా ఉంటుంది. అయితే సంపాదించిన డబ్బును పొదుపు చేసుకుంటేనే మీరు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు పడరు. సరైన ప్రణాళికతో డబ్బును సేవ్ చేసుకుంటే మీరు కూడా ధనవంతులు కావచ్చు. మనీ మేనేజ్‌మెంట్ తప్పకుండా తెలుసుకోవాలి.
వృథా ఖర్చులను తగ్గించుకోండి
మీరు మొట్టమొదట చేయాల్సిన పని వృథా ఖర్చులను తగ్గించుకోవడం. ప్రతి నెలా ఖర్చులను పేపర్‌పై రాసి.. అందులో వృథా ఖర్చులను విశ్లేషించుకుని తగ్గించుకోండి. నెలవారీ బడ్జెట్‌ను ముందుగానే సిద్ధం చేసుకోండి. అందుకు తగినట్లే డబ్బును ఖర్చు చేసుకోండి.
క్యాష్ ఇవ్వండి..
మన దేశంలో ఇటీవల ఆన్‌లైన్ లావాదేవీలు భారీగా పెరిగిపోయాయి. మీరు ఆన్‌లైన్‌లో కాకుండా నగదు చెల్లింపులు చేయాలి. నగదు చెల్లింపుల ద్వారా అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవచ్చు. ఆన్‌లైన్‌లో చెల్లించే సమయంలో ఖర్చు గురించి పెద్దగా ఆలోచించే అవకాశం ఉండదు. నగదు చెల్లింపు సమయంలో కచ్చితంగా ఖర్చు చేసే ముందు ఆలోచనలో పడతారు.
ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి
మీరు సంపాదించే ప్రతి రూపాయిలో ఎంతోకొంత ఇన్వెస్ట్ చేయడం అలవాటు చేసుకోవాలి. ప్రతి నెలా కొంచెం కొంచెం సేవ్ చేసుకుంటూ వెళితే.. భవిష్యత్‌లో అది పెద్ద ఫండ్ అవుతుంది. మీ డబ్బును వివిధ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయాలి. ప్రస్తుతం ఇన్వెస్ట్‌మెంట్ కోసం అనేక స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో డబ్బును పెట్టుబడి పెట్టి.. మంచి ఆదాయం పొందవచ్చు.
ట్యాక్స్‌లను సేవ్ చేసుకోండి..
మీరు ఎక్కువ ట్యాక్స్‌లు చెల్లిస్తున్నట్లయితే.. వివిధ ప్రభుత్వ పథకాలలో డబ్బును ఇన్వెస్ట్ చేయాలి. మీరు సమయానికి సరిగ్గా ఇన్వెస్ట్ చేస్తే.. మీరు చాలా వరకు ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే మీకు రెండు ప్రయోజనాలు కలుగుతాయి. మీరు ట్యాక్స్ ప్రయోజనం పొందడంతోపాటు.. ఎక్కడ పెట్టుబడి పెట్టినా మెరుగైన మంచి ఆదాయం పొందొచ్చు.
Also Read: SRH New Captain: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ? అందుకే అతడిని అంత ధరకు కొనుగోలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook