How To Burn Belly Fat: ఎన్ని ప్రయత్నాలు చేసిన బరువు తగ్గడం లేదా.. అయితే ఇలా చేయండి..!

How To Burn Belly Fat: శరీరంలో కొలెస్ట్రాల్‌ పరిమాణం పెరగడం వల్ల మధుమేహం, గుండెపోటు, అధిక రక్తపోటు సమస్యలు వస్తాయి. అంతేకాకుండా బరువు పెరగడం వంటి సమస్యల బారిన కూడా పడతారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 14, 2022, 11:41 AM IST
  • 10 రోజుల్లో బరువు తగ్గాలంటే..
  • రాత్రి పూట పెరుగు, బాదం తినండి
  • ఇలా క్రమం తప్పకుండా చేస్తే బరువు తగ్గుతారు
How To Burn Belly Fat: ఎన్ని ప్రయత్నాలు చేసిన బరువు తగ్గడం లేదా.. అయితే ఇలా చేయండి..!

How To Burn Belly Fat: శరీరంలో కొలెస్ట్రాల్‌ పరిమాణం పెరగడం వల్ల మధుమేహం, గుండెపోటు, అధిక రక్తపోటు సమస్యలు వస్తాయి. అంతేకాకుండా బరువు పెరగడం వంటి సమస్యల బారిన కూడా పడతారు. ముఖ్యంగా ఆడవారిలో పొట్ట, నడుము చుట్టూ కొవ్వు పెరగడం వల్ల పై సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల శరీర ఆకృతి కూడా చెడిపోతుంది.

వేగంగా బరువు తగ్గడానికి మీరు రాత్రిపూట వీటిని తినండి:

నిత్యం దారిలో దొరికే జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్‌ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కొందరు బిజీ లైఫ్‌ కారణంగా తీసుకునే ఆహారంపై కూడా శ్రద్ధ వహించరు. అయితే రాత్రి పూట ఈ నాలుగు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. పెరుగు (curd)

రాత్రిపూట తిన్న తర్వాత తప్పనిసరిగా పెరుగు తాగాలి. ఇందులో కేలరీలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కావున శరీరంలో కండరాలను బలంగా చేసేందుకు కృషి చేస్తాయి. ఇందులో ఉండే సూక్ష్మపోషకాలు జీర్ణక్రియను మేరుగు పరిచి.. బరువును నియంత్రిస్తుంది.

2. బాదం (almond)

కొన్ని సందర్బాల్లో రాత్రి తిన్న తర్వాత కూడా ఆకలిగా అనిపిస్తుంది. ఇదిద ఎక్కువగా ఆలస్యంగా నిద్రపోయే వ్యక్తులలో జరుగుతుంది. అయితే ఇలా జరిగితే అన్నంకు బదులుగా బాదంపప్పులను తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఆకలిని తీర్చడమే కాకుండా శరీరాన్ని దృఢంగా చేస్తుందని నిపుణులు అభిప్రాయడుతున్నారు.

3. గ్రెయిన్ బ్రెడ్ (Grain bread)

రాత్రిపూట ఆకలిగా అనిపిస్తే.. వేరుశెనగ, వెన్నను బ్రెడ్‌ ముక్కపై అప్లై చేసి కూడా తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది జీవక్రియను మెరుగుపరిచి బరువు తగ్గడానికి సహాయపడుతుందని నిపుణులు తెలుపుతున్నారు.

4. అరటి (banana)
 ప్రస్తుతం చాలా మంది అరటి పండు తినడం వల్ల బరువు పెరుగుతారని అనుకుంటారు. అయితే వీటిని తినడం వల్ల ఎలాంటి బరువు పెరగరని నిపుణులు పేర్కొన్నారు. ఇందులో ఉండే పోషకాలు బరువు తగ్గడానికి సహాయపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read:  Health Benefits Of Egg Yolk : గుడ్డు పచ్చసొన తినడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!

Also Read:  Monsoon Diet: వర్షాకాలంలో చైనీస్ ఫుడ్‌ తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News