How To Get Healthy Hair Naturally At Home: సౌత్ ఇండియన్ అమ్మాయిల జుట్టు నల్లగా, మందంగా, పొడవుగా ఉండటం మీరు తరచుగా చూసి ఉంటారు. ఎవరి వెంట్రుకలు చూసినా నల్లగా దృఢంగా ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరు వారి జుట్టు కూడా నల్లగా దృఢంగా మారాలని కోరిక ఉంటుంది. దీనికోసం చాలామంది మార్కెట్లో లభించే వివిధ రకాల హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ను వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని ఈ హెయిర్ మాస్క్ ను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు జుట్టును నల్లగా చేయడమే కాకుండా దృఢంగా చేసేందుకు కూడా సహాయపడతాయి. అయితే ఈ హెయిర్ మాస్క్ ను ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
హెయిర్ మాస్క్ తయారీకి కావలసిన పదార్థాలు:
✽ టీ స్పూన్ నువ్వులు
✽ ఒక టీ స్పూన్ మెంతుల
✽ ఐదు రెమ్మల కరివేపాకు
Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
హెయిర్ మాస్క్ తయారీ పద్ధతి:
✽ ముందుగా ఈ హెయిర్ మాస్క్ ను తయారు చేయడానికి.. బ్లెండర్ జార్ తీసుకోవాలి.
✽ ఆ తర్వాత ఇందులో ఆ మూడు పదార్థాలను వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి.
✽ ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక చిన్న ప్లాస్టిక్ కంటైనర్ లో భద్రపరుచుకోవాలి.
హెయిర్ మాస్క్ వినియోగించే పద్ధతి:
✽ ఈ మాస్క్ ను వినియోగించడానికి ముందుగా డబ్బులో నిద్రపరచుకున్న పొడిని కొబ్బరి నూనెలో కలిపి మిశ్రమంలో తయారు చేసుకోవాలి.
✽ తర్వాత జుట్టును బాగా శుభ్రం చేసుకుని.. కొబ్బరి నూనెలో కలిపిన ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి.
✽ అప్లై చేసుకున్న 15 నుంచి 20 నిమిషాల తర్వాత స్నానం చేయాలి.
✽ క్రమం తప్పకుండా ఈ హెయిర్ మాస్క్ ను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Hair Care Tips: ఈ మిశ్రమంతో కేవలం 20 రోజుల్లో మీ జుట్టులో మార్పులు పొందడం ఖాయం..