Dopamine Foods: డోపమైన్ పెంచే ఆహార పదార్థాలు ఇవే!

Natural Foods For Dopamine: మనలో చాలామంది  కొన్ని సార్లు  దిగులుగా, ఆందోళనగా కనిపిస్తుంటారు. అంతేకాకుండా చిన్న చిన్న విషయాలకు చికాకు వేస్తుంటుంది. దీనికి కారణం డోపమైన్ అనే హార్మోన్‌ తగ్గినప్పుడు ఈ సమస్య కనిపిస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కొన్ని ఆహారపదార్ధాలు తీసుకోవడం వల్ల డోపమైనను పెంచుకోవచ్చు. ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2024, 02:28 PM IST
Dopamine Foods: డోపమైన్ పెంచే ఆహార పదార్థాలు ఇవే!

Natural Foods For Dopamine: డోపమైన్‌ హార్మోన్‌ ని అడ్రినల్‌ గ్లాండ్‌ ఉత్పత్తి చేసుంది. ఈ డోపమైన్‌ శరీర కదలికలను, జ్ఞాపకశక్తిని, మానసిక స్థితికి పెంచడంలో ఎంతో సహాయపడుతుంది.  శరీరంలో ఈ డోపమన్‌ లెవల్స్‌ అనేవి తగ్గింత స్థాయిలో ఉండటం ఏంతో అవసరం.  డోపమైన్‌  మన శరీరంలో విడుదల అవ్వడం వల్ల మనం ఎంతో సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉంటామని పరిశోధనలో తేలింది.  ఇతరులపై ప్రేమ కలగడానికి  గల కారణం కూడా  ఈ డోపమన్ అని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని సార్లు దిగులు, ఆందోళన వంటి సమస్యలు  కనిపిస్తాయి. అయితే కొన్ని రకమైన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ డోపమైన్‌ హార్మోన్‌ను పెంచకోవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల  డోపమన్‌ పెంచవచ్చ అనేది మనం తెలుసుకుందాం. 

కాఫీ: కాఫీని చాలామంది తీవ్రమైన తలనొప్పి ఉన్నప్పుడు తాగుతుంటారు. దీనిని తీసుకోవడం వల్ల మూడ్‌ కాస్తా ఉత్సాహంగా ఉంటుంది.  

నట్స్‌: ప్రతిరోజు నట్స్‌ తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యం, సంతోషంగా ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. నట్స్‌లో ఆమైనో యాసిడ్స్‌ ఎక్కువగా లభిస్తుంది. ఇది డోపమైన్‌ పెంచడంలో సహాయపడుతుంది. వేరుశెనగలు, గుమ్మడి గింజలు, నువ్వులు తీసుకోవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు.

పచ్చి కొబ్బరి: పచ్చి కొబ్బరి ట్రై గ్లిజరైడ్లు లెవల్స్‌ ఉంటాయి. ఇవి మన మెదడు, శరీరం మెరుగుపరచడంలో సహాయపడుతాయి. అంతేకాకుండా ఒత్తిడి మాయం చేయడంలో ఉపయోగపడుతుంది.

అవకాడో: అవకాడో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.  దీనిలోని కొలీన్‌ మూడ్‌ను సంతోషంగా మార్చే లక్షణాలు ఉంటాయి. అంతేకాకుండా ఒత్తిడి స్థాయులను అదుపు చేస్తుంది. 

బెర్రీలు: తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు బెర్రీలను తీసుకోవడం ఎంతో మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నరు. బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా లభిస్తాయి. దీని వల్ల డోపమైన్‌ హార్మోన్‌ పెరుగుతుంది.

Also read: Skipping Meals: మధ్యాహ్నం భోజనం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

డార్క్‌ చాక్లెట్స్‌: డార్క్‌ చాక్లెట్స్‌ ఒత్తిడి సమయంలో ఎంతో ఉపయోగపడుతుంది. డార్క్‌ చాక్లెట్‌లో ఫినైల్‌థైలమైన్‌ డోపమైన్‌ను విడుదల చేయడంలో సహాయపడుతుంది.

అరటిపండు: అరటిపండు తినడం వల్ల డోపమైన్‌, సెరోటోనిన్ న్యూరో టాన్స్‌మీటర్ల విడుదలకు సహాయపడుతుంది. దీని మెదడు, శరీరం చురుగ్గా ఉండేలా చేయడానికి ఉపయోగడుతుంది.

డెయిరీ ఉత్పత్తులు: చీజ్‌, పాలు, పెరుగు తినడం వల్ల ఒత్తిడి సమస్య తగ్గుతుంది. వీటిని తీసుకోవడం వల్ల  హ్యాపీ హార్మోన్‌ విడుదల అవుతుంది. 

Also read: Teenage Skin Care Tips: అందంగా ఉండాలంటే టీనేజ్ అమ్మాయిలు ఏం చేయాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News