Summer Skin Care Tips: చేతులకు ఎక్స్‌ఫోలియేషన్ చేయడానికి మ్యాజిక్‌ క్రీమ్!

How To Make Aloe Vera Hand Cream: చేతులకు ఎక్స్‌ఫోలియేషన్ చేయడానికి తప్పకుండా అలోవెరా హ్యాండ్ క్రీమ్ వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 11, 2023, 04:55 PM IST
Summer Skin Care Tips: చేతులకు ఎక్స్‌ఫోలియేషన్ చేయడానికి మ్యాజిక్‌ క్రీమ్!

How To Make Aloe Vera Hand Cream: మృదువైన, మెరిసే చేతులకు ఎక్స్‌ఫోలియేషన్ చాలా ముఖ్యం. అయితే ఇలాంటి క్రమంలో తప్పకుండా అలోవెరా హ్యాండ్ క్రీమ్ వినియోగించడం చాలా మంచిదని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. కలబందలో సాలిసిలిక్ యాసిడ్స్‌ లభిస్తాయి. ఇది చనిపోయిన చర్మాన్ని తొలగించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా చర్మానికి అంతర్గత పోషణను అందిస్తుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల చర్మ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగించేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా చర్మాన్ని యవ్వనంగా చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి అలోవెరా హ్యాండ్ క్రీమ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

అలోవెరా హ్యాండ్ క్రీమ్ చేయడానికి కావలసిన పదార్థాలు:
>>అలోవెరా జెల్
>>గ్లిజరిన్
>>రోజ్ వాటర్

ఈ క్రీమ్‌ను ఇలా తయారు చేయండి:
అలోవెరా హ్యాండ్ క్రీమ్ చేయడానికి..ముందుగా ఒక గిన్నె తీసుకోండి.
ఆ తర్వాత అందులో తాజా అలోవెరా జెల్‌ను తీసుకోవాలి.
అందులో రోజ్ వాటర్, గ్లిజరిన్ కలపాలి.
తర్వాత ఈ మిశ్రమాన్ని మంటపై వేడి చేయాలి.
కావాలంటే ఈ మిశ్రమంలో టీ ట్రీ ఆయిల్ లాంటి ఎసెన్షియల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు.
తర్వాత తయారుచేసిన మిశ్రమాన్ని చిన్న పాత్రలో తీసి నిల్వ చేసుకోవాలి.
ఇలా సిద్ధం చేసుకున్న అలోవెరా హ్యాండ్ క్రీమ్ చేతులకు రాసుకుంటే మంచి ప్రయోజనాలు పొందుతారు.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also read: MP Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన విషయాలు.. మొత్తం బయటపెట్టిన అవినాష్ రెడ్డి

Also read: MP Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన విషయాలు.. మొత్తం బయటపెట్టిన అవినాష్ రెడ్డి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News