Chilli Chicken Recipe: చికెన్‌తో ఏ వంటలు చేసిన రుచి అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో మనం చికెన్ కూర, ఫ్రై, వేపుడు వంటివి తయారు చేసుకుంటాం. అయితే, రుచికరమైన చిల్లీ చికెన్ ఎప్పుడైనా ఇంట్లో తయారు చేశారా? దీన్ని రుచి అద్భుతంగా ఉంటుంది. నోట్లో వేసుకోగానే మెత్తగా కరిగిపోయి రుచికరంగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేరకమైన చికెన్ రిసిపీ కాకుండా ఈసారి కాస్త ఏదైనా డిఫరెంట్‌గా తినాలనుకుంటే ఇంట్లోనే ఇలా ఈజీగా చిల్లీ చికెన్ చేసుకోండి. రుచి అద్భుతంగా ఉంటుంది.
చిల్లీ చికెన్ రిసిపీకి కావాల్సిన పదార్థాలు..
బోన్‌లెస్ చికెన్- అరకేజీ
సోయా సాస్-2 tbsp
వెనిగర్-1 tbsp
టమోటా కెచప్-1tbsp
చిల్లీ సాస్-1 tbsp
కార్న్‌స్టార్చ్-2 tbsp
అల్లంవెల్లుల్లి పేస్ట్- tbsp
ఉప్పు- రుచికి సరిపడా
నూనె- డీప్ ఫ్రై
ఉల్లిపాయ-1
బెల్ పెప్పర్-2
ఉల్లికాడలు - గార్నిషింగ్
ఇదీ చదవండి: ఘుమఘుమలాడే పుదీనా చికెన్.. అబ్బొ చూస్తేనే నోరూరిపోతుంది..
చిల్లీ చికెన్ రిసిపీ తయారీ విధానం..
చికెన్ ముందుగా శుభ్రం కడిగి సోయా సాస్, వెనిగర్, టమాలో కెచప్, రెడ్ చిల్లీ సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ స్టార్చ్, ఉప్పుకూడా వేసి ఓ అరగంటపాటు మ్యారినేట్ చేసుకోవాలి.
మరో ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి కట్ చేసిన ఉల్లిపాయలు, బెల్ పెప్పర్స్ సన్నగా కట్ చేసింది వేసి కొద్ది నిమిషాలపాటు వేయించుకోవాలి.
ఇదీ చదవండి: షాహి చికెన్ కుర్మా రెసిపీ.. ఇలా చేసుకుంటే ఎంతో టేస్టీ..
మ్యారినేట్ చేసిన చికెన్ ఇందులోనే వేసి కాసేపు టాస్ చేసుకోవాలి. కొన్ని నిమిషాలపాటు ఇలా ఉడికించుకోవాలి. చికెన్, కూరగాయలు బాగా ఉడికే వరకు వండుకోవాలి. చివరగా పైనుంచి ఉల్లికాడలు కూడా వేసి వేడివేడిగా వడ్డించుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter