Sritej Serious condition: పుష్పకు మళ్లీ టెన్షన్.. రేవతి కొడుకు శ్రీతేజ్ పరిస్థితి విషమం..

Sritej Serious condition: సంధ్య థియేటర్ లో పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా  జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే యువతి మృతి చెందిన సంగతి తెలిసిందే కదా.మరోవైపు ఈ ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 15, 2024, 08:24 AM IST
Sritej Serious condition: పుష్పకు  మళ్లీ టెన్షన్.. రేవతి కొడుకు శ్రీతేజ్ పరిస్థితి విషమం..

Sritej Serious condition: హైదరాబాద్.. ఆర్టీసీ క్రాస్ క్రాస్ రోడ్డులో ఉన్న సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే యువతి కన్నుమూసిన సంగతి తెలిసిందే కదా. అల్లు అర్జున్ సరైన సమాచారం లేకుండా థియేటర్ కు రావడంతో జరిగిన తొక్కిసలాటలో ఆమె మరణించింది. దీంతో ఈ కేసులో తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ ను ఏ11గా చేర్చింది. ఇప్పటికే ఈ ఘటనలో అరెస్ట్ ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే అల్లు అర్జున్ ను ఈ కేసులో అరెస్ట్ చేసింది. మరోవైపు ఈ కేసులో నాంపల్లి కోర్టు 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే కదా. అదే రోజు హై కోర్టులో అల్లు అర్జున్ తరుపున లాయర్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. బన్నికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

అయితే.. అల్లు అర్జున్ తన జీవితంలో ఏదైతే చూడకూడదని అనుకున్నాడో అదే జరిగింది. శుక్రవారం రాత్రి వరకు బెయిల్ పత్రాలు రాకపోవడంతో ఒక రోజు రాత్రి జైలులోనే గడపాల్సి వచ్చింది. ఒక రకంగా అల్లు ఫ్యామిలీకి 13వ తేది కాళరాత్రి అనే చెప్పాలి. ఇక జైలు నుంచి విడుదలైన తర్వాత టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోలు ఒక్కొక్కరు అల్లు అర్జున్ ను పరామర్శిస్తున్నారు. ఈ కోవలో కాసేట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లనున్నారు.

మరోవైపు ఈ ఘటనలో గాయపడ్డ బాలుడు  శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్  వైద్యులు  హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు . శ్రీతేజ్ పీఐసీయూలో వెంటిలేటర్‌ పై చికిత్స  అందిస్తున్నారు. అతడికి పైప్‌ ద్వారా ఆహారం అందిస్తున్నట్టు తెలిపారు. అడపాదడపా జ్వరం వస్తుందని డాక్టర్లు చెప్పారు. శ్రీ తేజ్  11 రోజులుగా  కిమ్స్ దవాఖానాలో  మృత్యువుతో పోరాడుతున్నారు. బాలుడికి జరగరానిది ఏదైనా జరిగితే మాత్రం పుష్ప భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పాలి.

ఇదీ చదవండి: Nagababu Cabinet: ముగ్గురు మొనగాళ్లు.. దేశంలోనే మొదటిసారి..

ఇదీ చదవండి: ఫామ్ హౌస్ రౌడీ.. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News