Kajal: ఇంట్లోనే పిల్లల కోసం కాటుకను ఇలా తయారు చేసుకోవచ్చు.. తయారీ విధానం

How To Make Kajal: మార్కెట్‌లో లభించే కాటుక కంటే ఇంట్లోనే సహాజంగా కాటుకను తయారు చేసుకొని ఉపయోగించడం వల్ల ఆరోగ్య మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీని కోసం ఎలాంటి ఖరీదైనా వస్తువులు ఉపయోగించాల్సి అవసరం లేదు. ఇంట్లో లభించే కొన్ని పదార్థాలను ఉపయోగిస్తే సరిపోతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు ఇది మంచిది. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. 

Written by - Shashi Maheshwarapu | Last Updated : Oct 21, 2024, 04:24 PM IST
Kajal: ఇంట్లోనే పిల్లల కోసం కాటుకను ఇలా తయారు చేసుకోవచ్చు.. తయారీ విధానం

How To Make Kajal: కాటుక అంటే కేవలం ఒక అలంకార వస్తువే కాదు. ఇది భారతీయ సంస్కృతిలో ఆరోగ్యం, సౌందర్యానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన సంప్రదాయం. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న చాలా ఆహార పదార్థాలు, ప్రొడెక్ట్స్‌లు రసాయనాలతో తయారు చేయడం కొంత ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా కాటుకల విషయంలో కెమికల్స్ ఉపయోగించడం వల్ల కంటి సమస్యలు వస్తున్నాయనేది ఆందోళన కలిగిస్తాయి.

 కొన్ని అధ్యయనాలు, కొన్ని రకాల రసాయనాలు కంటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేయగలవని సూచిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని రసాయనాలు కంటిలో వాపు, చికాకు కొన్ని సందర్భాల్లో కంటి అలెర్జీలను కలిగించవచ్చు.
కంటి సమస్యలు రావడానికి కెమికల్స్ ఒక్కటే కారణం కాదు. వయసు, జన్యువులు, పోషకాహార లోపాలు, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కంటి సమస్యలకు దారితీయవచ్చు. అధికంగా కెమికల్స్‌తో తయారైన కాటుకలు తీసుకోవడం వల్ల కంటి సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎక్కవగా పుట్టిన పిల్లలో ఈ సమస్యలు కలగడం బాధ కలిగిస్తుంది. అయితే ఇంట్లోనే సహాజనంగా కాటుకను తయారు చేసుకోవచ్చు. ఇది ఎన్నో సంవత్సరాలు వస్తున్న పద్ధతి. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. 

కావలసిన పదార్థాలు:

నూనె (నెయ్యి, ఆలివ్ ఆయిల్ లేదా ఏదైనా వృక్షసంబంధమైన నూనె)
పత్తి దూది
ప్లేట్
దీపం

తయారీ విధానం:

ఒక చిన్న దీపంలో నూనె నింపి, పత్తి దూదిని తీసి దీపంలో వేయాలి. దీపం వెలిగించి, దాని పైన ఒక ప్లేటును తిరగబెట్టి ఉంచాలి.  దీపం వెలిగిస్తే, ప్లేట్ అడుగు భాగంలో నల్లటి పొగమంచు ఏర్పడటం మొదలవుతుంది. ఇదే కాటుక. కొన్ని గంటల తర్వాత, ప్లేటును తీసి, ఏర్పడిన నల్లటి పొడిని ఒక పాత్రలో సేకరించాలి. ఇది మీ ఇంట్లో తయారైన సహజ కాటుక. నెయ్యి ఉపయోగించడం మంచిది. ఎందుకంటే ఇది చల్లదనాన్ని ఇస్తుంది.

కాటుక ఉపయోగాలు:

కళ్ళకు చల్లదనం: కాటుకను కళ్ళకు రాసుకోవడం వల్ల కళ్ళకు చల్లదనం లభిస్తుంది.
కంటి సమస్యలు: కొన్ని రకాల కంటి సమస్యలకు కాటుక ఉపయోగపడుతుంది.
అందం: కాటుకను మాయిశ్చరైజర్‌గా కూడా ఉపయోగించవచ్చు.

ఇతర పద్ధతులు:

ఆముదం: కొంతమంది ఆముదంను ఉపయోగించి కూడా కాటుక తయారు చేస్తారు.
బాదం నూనె: బాదం నూనెతో చేసిన కాటుక కూడా మంచి ఫలితాలు ఇస్తుంది.

ఈ విధంగా ఇంట్లో కాటుకను తయారు చేసుకోవచ్చు. దీని వల్ల కంటికి ఎలాంటి సమస్యలు కలగవు.

 

 

https://www.instagram.com/reel/CsTeT5TAdlq/?utm_source=ig_web_copy_link

 

 

 

 

Also Read: Weight Loss Upma Recipe: శరీర బరువును తగ్గించే బ్రౌన్ ఉప్మా.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News