Peanuts Facemask:మన వంటింట్లో లభించే వివిధ రకాల పదార్ధాలతో ముఖ సౌందర్యాన్ని పరిరక్షించుకోవచ్చు. వేరుశెనగ గుళ్లతో కూడా ముఖంపై గ్లో పెంచుకోవచ్చని ఎంతమందికి తెలుసు..అసలు వేరుశెనగ గుళ్లతో ఫేస్‌మాస్క్ ఏంటనుకుంటున్నారా..లెట్స్ రీడ్ ద స్టోరీ..
వేరుశెనగ బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. ఇందులో ఉండే పోషక గుణాలు ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే వేరుశెనగ గుళ్లతో ముఖ సౌందర్యం కూడా పెంచవచ్చంటున్నారు బ్యుటీషియన్లు. దీనికోసం తడిసిన గ్రౌండ్ నట్స్ వాడాల్సి ఉంటుంది. తడిసిన వేరుశెనగ గుళ్లతో ఫేస్‌మాస్క్ చేసి ముఖానికి రాసుకుంటే..అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. ముఖంపై మచ్చలు, మరకలు పోయి..ముఖం కాంతివంతంగా మారుతుంది. చర్మంపై నిగారింపు వస్తుంది. మరి వేరుశెనగ గుళ్లతో ఫేస్‌మాస్క్ ఎలా తయారు చేయాలో కూడా చూద్దాం..
వేరుశెనగ గుళ్లతో ఫేస్‌మాస్క్
ముందుగా రెండు స్పూన్స్ పీనట్స్ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇందులో 2 స్పూన్స్ క్రష్ చేసిన అరటిపండు కలపాలి. ఆ తరువాత రెండింటినీ స్పష్టంగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత..గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. నెలలో మూడుసార్లు ఇలా చేస్తే మీ ముఖ సౌందర్యం పెరుగుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది.
వేరుశెనగ ఫేస్‌మాస్క్ లాభాలు
వేరు శెనగ ఫేస్‌మాస్క్‌తో ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఏ విధమైన మచ్చలుండవు. పింపుల్స్ కూడా తగ్గుముఖం పడతాయి. ముఖం క్లీన్‌గా మారుతుంది. బ్లడ్ హెడ్స్ ఉంటే తగ్గిపోతాయి. చర్మం నిగారింపు వస్తుంది.
Also read: Spinach Benefits: పాలకూర మగవారికి ఎంత ప్రయోజనకరమో తెలుసా..ఫిట్‌గా ఉంచుతుంది
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook