Dum Aloo Recipe: యమ్మీ దమ్ ఆలూ రిసిసీ.. ఇలా సింపుల్ గా తయారు చేసుకోండి..

Dum Aloo Recipe: ఈరోజు సింపుల్ గా ఇంట్లోనే దమ్ ఆలూ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దమ్ ఆలూ ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది మామూలు బంగాళదుంపలతో కాకుండా చిన్నపాటి బేబీ పొటాటోస్ తో తయారుచేస్తారు.

Written by - Renuka Godugu | Last Updated : Aug 19, 2024, 08:45 PM IST
Dum Aloo Recipe: యమ్మీ దమ్ ఆలూ రిసిసీ.. ఇలా సింపుల్ గా తయారు చేసుకోండి..

Dum Aloo Recipe: దమ్ ఆలూ ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది మామూలు బంగాళదుంపలతో కాకుండా చిన్నపాటి బేబీ పొటాటోస్ తో తయారుచేస్తారు. ఇందులో రుచికరమైన గ్రేవీ తయారు చేసుకుంటే రుచి అదిరిపోతుంది. అయితే ఈరోజు సింపుల్ గా ఇంట్లోనే దమ్ ఆలూ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు..
బేబీ పొటాటోస్ -అరకిలో 
నూనె -4 టేబుల్ స్పూన్లు 
జీలకర్ర -ఒక టేబుల్ స్పూన్ 
బిర్యానీ ఆకు- ఒకటి
 దాల్చిన చెక్క- ఒక ఇంచు
 లవంగాలు -3
 యాలకులు -3
 ఉల్లిపాయలు-2 పెద్దవి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ -ఒక టేబుల్ స్పూన్లు
 టమాటాలు-2 ప్యూరీ తయారు చేసుకోవాలి
 పసుపు -అర టీ స్పూను
 కారంపొడి -ఒక టేబుల్ స్పూన్
 ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్
 జీలకర్ర పొడి -అర టేబుల్ స్పూన్ 
గరం మసాలా- అర టేబుల్ స్పూను 
ఉప్పు -రుచికి సరిపడా 
ఫ్రెష్ క్రీమ్ -2 టేబుల్ స్పూన్లు
 కొత్తిమీర

ఇదీ చదవండి:  నిమ్మ నూనెను ఇలా వాడితే జుట్టు ఆరోగ్యంగా.. చుండ్రు, స్ల్పిట్‌ ఎండ్‌ సమస్య లేకుండా పెరుగుతూనే ఉంటుంది..

దమ్‌ ఆలూ తయారీ విధానం..
ముందుగా బేబీ పొటాటోలు శుభ్రంగా కడుక్కొని తొక్క తీసుకొని పెట్టుకోవాలి. ఫోర్క్ సాయంతో బేబీ పొటాటోలను అక్కడక్కడా గుచ్చాలి. అప్పుడు బాగా ఉడుకుతాయి ఆ తర్వాత ఒక పాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె పోసి మీడియం మంటపై వెయిట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఈ పొటాటోస్ వేసి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు క్రిస్పీగా అన్ని వైపులా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఆలుగడ్డలు చూస్తే ఎంతో అందంగా కనిపిస్తాయి. ఆ తర్వాత పాన్ పైనుంచి తీసి పక్కన పెట్టుకోవాలి

 అదే పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి మంచి అరోమా వచ్చేవరకు వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేవరకు వేయించాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసి ఆయిల్ సపరేట్ అయ్యేవరకు బాగా ఉడికించుకోవాలి.

ఇదీ చదవండి:  రాఖీ పౌర్ణమి ప్రత్యేక మెహందీ చిత్రాలు.. నిమిషంలో వేసుకునే రక్షాబంధన్‌ డిజైన్స్‌..

ఇప్పుడు ఇందులోనే పసుపు, కారంపొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా ఒక రెండు మూడు నిమిషాల వరకు ఇప్పుడు ఈ మసాలాలోకి బంగాళదుంపలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక కప్పు నీళ్లు కూడా వేసి బాగా కలిపి సిమ్ లో ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అప్పుడు ఈ బంగాళదుంపలు బాగా ఉడుకుతాయి గ్రేవీ కూడా థిక్ గా మారుతుంది. ఇందులో పైనుంచి ఫ్రెష్ క్రీమ్ కూడా వేసి కొత్తిమీరతో గర్నిష్ చేసుకుంటే వేడివేడి దమ్ ఆలూ రెసిపీ రెడీ. ఇది నాన్ రోటి రైస్ లోకి రుచి అదిరిపోతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News