Panchamrit Recipe For Janmashtami 2024: పంచామృతం అనేది భారతీయ సాంప్రదాయ స్వీట్ రెసిపీ. వివిధ పూజలోని నవరాత్రులు సమయంలో పంచామృతాన్ని తయారు చేసుకుంటారు. ఇది దేవత దేవుళ్ళకు అత్యంత ఇష్టమైన ప్రసాదం. పంచామృతం దేవుళ్లకు సమర్పించిన తర్వాత భక్తులు కూడా తీసుకుంటారు. ప్రసాదంగా సంస్కృతంలో పంచ అంటే 5, అమృత అంటే అమృతం అని అర్థం. అమృతం తీసుకోవడం వల్ల అమరత్వం పొందుతారు. అందుకే మనం దేవుళ్లకు పండుగల సమయంలో తయారుచేసి పెడతాం. అయితే ఈ పంచామృతాన్ని ఐదు సింపుల్ వస్తువులను యాడ్ చేసి తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా మక్కా నా డ్రై ఫ్రూట్స్ అంజీర్ చక్కెర లేదా బెల్లం వంటివి వేసి సులభంగా తయారు చేసుకోవచ్చు.
ఆగస్టు 26 సోమవారం జన్మాష్టమి సందర్భంగా కృష్ణయ్యకు ఎంతో ఇష్టమైన ఈ పంచామృతం రెసిపీని తయారు చేసి ఆయనకు ప్రసాదంగా సమర్పించండి దీని వల్ల మీరు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి.
పంచామృతం తయారు చేసుకునే విధానం..
ముందుగా ఒక సిల్వర్ లేకపోతే ఇతడి పాత్రను తీసుకోవాలి పంచామృతం అందులు తయారు చేసుకుంటే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది.
ఒక టేబుల్ స్పూన్ చక్కర ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్, పెరుగు రెండు టేబుల్ స్పూన్ల, నెయ్యి రుచికి సరిపడా ఎనిమిది టేబుల్ స్పూన్స్ పాలు పోసి కలపాలి.
ఈ వస్తువులన్నీ బాగా కలిపిన కలిసే విధంగా కలుపుతూ ఉండాలి
ఇప్పుడు ఈ పంచామృతం రెడీ అయినట్లే ఈ స్వీట్ ని కృష్ణుడికి ప్రసాదంగా సమర్పించి భక్తులు కూడా తీసుకోవాలి దీనివల్ల ఆయన ఆశీర్వాదాలు పుష్కలంగా లభిస్తాయి.
ఇదీ చదవండి: మగవారి బలమైన జుట్టుకు టాప్ 5 హెయిర్ ఆయిల్స్ ఇవే..
పంచామృతం లో ఆయుర్వేదిక్ గుణాలు ఎన్నో పుష్కలంగా ఉంటాయి. దుర్గ పూజలో ముఖ్యంగా పంచామృతాన్ని తయారు చేస్తారు. ఐదు రకాల వస్తువులతో తయారు చేయడం వల్ల దీనికి పంచామృత అనే పేరు వచ్చింది. ముఖ్యంగా బెల్లం, తేనె, పెరుగు, పాలు, నెయ్యి వేసి తయారు చేస్తారు.
ఇదీ చదవండి: నెయ్యి ఇలా పెదాలకు అప్లై చేస్తే నేచురల్‌గా పింక్ రంగులోకి మారిపోతాయి..
హిందూ సంప్రదాయంలో పంచామృతానికి ప్రత్యేక స్థానం ఉంది జైనులు కూడా ఈ పంచామృతాన్ని తయారుచేస్తారు. జన్మాష్టమి మాత్రమే కాదు ఈ పంచామృతాన్ని శివయ్యకు దుర్గకు వినాయకుడికి కూడా వివిధ సందర్భాల్లో సమర్పించే సంప్రదాయం ఉంది ముఖ్యంగా ఇందులో వేసే పాలు ఎంతో పరిశుద్ధమైనవి పంచామృతం తయారు చేసుకోవడానికి ముఖ్యంగా ఆవుపాలను మాత్రమే వినియోగించాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook