Benefits Of Garlic For Skin: చర్మ సమస్యలు చిన్నవైనా.. పెద్దవైన ఎన్ని రకాలైనా సింపుల్‌గా 10 రోజుల్లో నయం..

Benefits Of Garlic For Skin: వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే మీరు ఎప్పుడైనా చర్మానికి వెల్లుల్లిని ఉపయోగించారా? దీంతో చర్మాన్ని మొటిమల నుంచి ముడతల వరకు తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుతున్నారు. ఎలాగో ఇప్పుడు తెలుసుకోండి..  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 27, 2022, 03:00 PM IST
Benefits Of Garlic For Skin: చర్మ సమస్యలు చిన్నవైనా.. పెద్దవైన ఎన్ని రకాలైనా సింపుల్‌గా 10 రోజుల్లో నయం..

How to Take Care of Your Skin: వెల్లుల్లిలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. వీటిన క్రమం తప్పకుండా ఆహారంలో వినియోగిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని దృఢంగా చేయడమేకాకుండా చర్మ సమస్యలకు కూడా సులభంగా చెక్‌ పెడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మందికి సందేహం కలగవచ్చు వెల్లుల్లి వల్ల చర్మానికి ఎలా ప్రయోజనాలు కలుగుతాయని.. కానీ ఇందులో ఉండే పోషకాలు చర్మ సమస్యలను కూడా సులభంగా తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని మొటిమల నుంచి ముడతల వరకు తగ్గించడానికి ప్రభావవంతంగా పని చేస్తుంది.

చర్మ సమస్యలకు వెల్లుల్లి:

మొటిమలు:
చాలా మంది వాతావరణంలో మార్పులు కారణంగా మొటిమలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి వెల్లుల్లి మొగ్గలను పేస్ట్‌గా తయారు చేసి.. అందులో అర టీస్పూన్ వైట్ వెనిగర్ కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని ముఖమంతా బాగా అప్లై చేయాలి. ఇలా క్రమం తప్పకుండా అప్లై చేస్తే మొటిమల సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.

చర్మపు చారలు:
సాగిన చారలను తొలగించుకోవడానికి చాలా మంది వివిధ రకాల ప్రోడక్ట్‌ వినియోగిస్తున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఒక టేబుల్ స్పూన్‌లో ఆవాల నూనెను వేడి చేసి అందులో రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ఇలా వేసిన వాటిని కొంచెం ఎర్రబడ్డాకా..ఈ నూనెను చర్మపు చారలపై అప్లై చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే అన్ని రకాల చర్మ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..

దిమ్మల సమస్య:
ప్రస్తుతం చాలా మంది దిమ్మల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి  వెల్లుల్లి సహాయపడుతుంది. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి కురుపులపై ఈ వెల్లుల్లి రెబ్బలను పెస్ట్‌లా చేసి అప్లై చేయండి.

ముడతలు:
ప్రస్తుతం చాలా మంది ముఖంపై ముడతల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే చర్మం బిగుతుగా ఉండడానికి.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక వెల్లుల్లి రెబ్బను తింటే చర్మం ముడతలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read: TRS MLAs Trap Issue: ఆపరేషన్ ఆకర్ష్.. ఎఫ్ఐఆర్‌లో సంచలన విషయాలు 

Also Read: Manish Tewari: కరెన్సీ నోట్లపై అంబేదర్క్ ఫొటో.. తెరపైకి కాంగ్రెస్ డిమాండ్.. సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలపై తీవ్ర చర్చ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

 

Trending News