Dried Apricots Benefits: డ్రై ఆఫ్రికాట్ పండు తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఇది పండు అలాగే డ్రై ఫ్రూట్స్ గా మార్కెట్‌లో లభిస్తుంది. దీనిని తీపి వంటకాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఆఫ్రికాట్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
ఆఫ్రికాట్ లలో విటమిన్ ఎ అధికంగా లభిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల కంటి చూపు సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మన జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల పొట్టిలోని ప్రేగులు శుభ్రం అవుతాయి. ఆఫ్రికాట్ పండ్లను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారు ఈ ఆఫ్రికాట్ తీసుకోవడం వల్ల ఇందులోని పొటాషియం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గుండె ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ఎంతో మేలు చేస్తుంది. ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన మలినాలు తొలగించడంలో కూడా ఈ పండు సహాయపడుతుంది.
ఈ పండ్లల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఈ పండ్లను ఎన్నో మంచి ఫలితాలను ఇస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉంచడంలో పండ్లు దోహదపడుతుంది.
Also read: Eye Vision Foods: మెరుగైన కంటి చూపుకు ఇవి తప్పకుండా తీసుకోండి!
ఆఫ్రికాట్‌ను తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారువుతుంది. ఎముకల సమస్యతో బాధపడుతున్నవారు ఈ పండును తీసుకోవడం వల్ల కీళ్ల సమస్యలు తగ్గుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పండు దొరికే కాలంలో తప్పకుండా తీసుకోవాలి.
ఆఫ్రికాట్ అనేది డ్రై ఫ్రూట్స్ రూపంలో లభిస్తుంది. ఆఫ్రికాట్ లను నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డ్రై ఆఫ్రికాట్ తీసుకొనే ముందు నీటితో బాగా కలిపి తినాలి. దీనిలో ఉండే చక్కెరలు దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
ఈ విధంగా డ్రై ఆఫ్రికాట్ తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్య ఫలితాలు పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter