Increasing Height: కేవలం నెల రోజుల్లోనే హైట్ పెరగాలనుకుంటున్నారా? అయితే ఇవి తప్పక ట్రై చేయండి..

Increasing Height: ప్రస్తుతం చాలామంది సరైన ఎత్తు పెరగడానికి బోన్ సర్జరీ చేయించుకుంటున్నారు. ఇలా చేయించుకోవడం చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనికి బదులుగా ఆరోగ్య నిపుణులు సూచించిన కొన్ని ఆహారాలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా ఉంటారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 1, 2023, 08:04 PM IST
Increasing Height: కేవలం నెల రోజుల్లోనే హైట్ పెరగాలనుకుంటున్నారా? అయితే ఇవి తప్పక ట్రై చేయండి..

 

Increasing Height: మనలో చాలామంది శరీరానికి దగ్గర బరువుతో పాటు ఎత్తు ఉండాలని ఎంతగానో కోరుకుంటారు. కానీ చాలామంది పుట్టుకతోనే పొట్టిగా పుడుతూ ఉంటారు. వయస్సు పెరిగిన కొద్దీ మగవారిలో 21వ సంవత్సరం నుంచి 22 సంవత్సరాల వరకు పెరుగుతారు. అదే మహిళల్లోనైతే 19 సంవత్సరాల వరకే ఎత్తు పెరుగుతారు. కొంతమందిలో ఎత్తు పెరగడం అనేది జీన్స్ పై కూడా ఆధారపడి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుxతున్నారు.

పూర్వికులు మనకంటే చాలా ఎత్తు ఉండేవారు. ఎందుకంటే వారు కేవలం ఆరోగ్యకరమైన ఆహారాలతో పాటు అడవుల్లో లభించే పండ్లు, ఫలాలను ఎక్కువగా తినేవారు. అయితే ప్రస్తుతం చాలామంది ఎత్తు పెరగడానికి అనేక రకాల సాధనాలతో పాటు రసాయనాలతో కూడిన ప్రొడక్ట్స్ కూడా వినియోగిస్తున్నారు. మరి కొంతమంది అయితే బోన్ సర్జరీలు కూడా చేయించుకుంటున్నారు. కొన్ని ఆయుర్వేద చిట్కాలను వినియోగించి ఎలాంటి సర్జరీలు, ఖర్చు లేకుండా సులభంగా పొడవు పెరగొచ్చు.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

చాలామంది పొడవు పెరగడానికి బోన్ సర్జరీలు చేయించుకుంటున్నారు. ఆ తర్వాత అనేక రకాల దుష్ప్రభావాల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారాలతో పాటు వ్యాయామాలు చేయడం వల్ల సులభంగా ఎత్తు పెరగవచ్చు. గ్రోత్ హార్మోన్స్ అనేవి థైరాయిడ్ గ్రంధులపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి థైరాయిడ్ గ్రంధులు పనితీరు బాగుంటేనే సులభంగా ఎత్తు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ గ్రంధులకు అవసరమైన ఆరోగ్యకరమైన ఆహారాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రతిరోజు విటమిన్-డి కలిగిన ఆహారాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. 20 సంవత్సరాలలోపు బరువు పెరగాలనుకుంటున్నారు తప్పకుండా విటమిన్ డి క్యాప్సిల్స్ వినియోగించవచ్చు.

అంతేకాకుండా ఎదిగే పిల్లలకు తప్పకుండా వారి తల్లిదండ్రులు ప్రోటీన్స్ అధిక పరిమాణంలో ఉండే ఆహారాలను తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. సరైన ఎత్తు పెరగడానికి శరీర బరువు ఎన్ని కిలోలు ఉంటుందో అన్ని కిలోలకు రెండు గ్రాముల ప్రోటీన్స్ చొప్పున లెక్క కట్టి పిల్లలకి అందించాల్సి ఉంటుంది.  ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం పిల్లలకు నానబెట్టిన మొలకలు, పుచ్చకాయ గింజలు, పొద్దు తిరుగుడు గింజలు, బాదం పప్పులు, గుమ్మడికాయ గింజలను ఇవ్వడం వల్ల సరైన ఎత్తు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News