Itchy Feet: పాదాల్లో మంట, దురద వంటి సమస్యలున్నవారు ఇది తాగితే 10 నిమిషాల్లో చెక్‌..

Itchy Sole Easy Home Remedies: ప్రస్తుతం చాలా మంది పాదాల్లో మంట, దురద వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ కింది చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. వీటిలో ఉండే గుణాలు అన్ని రకాల ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించడానికి సహాయపడతాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2023, 05:14 PM IST
Itchy Feet: పాదాల్లో మంట, దురద వంటి సమస్యలున్నవారు ఇది తాగితే 10 నిమిషాల్లో చెక్‌..

Itchy Sole Easy Home Remedies: వేసవి కాలంలో అరికాళ్ళకు విపరీతంగా చెమట పడతాయి. అయితే చాలా మంది సాక్సులు ధరించడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇలా చెమట పట్టడం వల్ల అరికాళ్ళు ప్రభావితం చెంది.. చాలా రకాల చర్మ సమస్యలు వచ్చే ఛాన్స్‌ ఉంది. దీని కారణంగా చాలా మందిలో తీవ్రమైన దురద, అరికాళ్ళు మండడం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యతో బాధపడితే పని చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. తరచుగా దురద సమస్యతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పలు ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. వీటి వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అరికాలి దురద ఎందుకు వస్తుంది?:
అరికాళ్ళలో దురదలు రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. పాదాలలో రక్త ప్రసరణ పెరగడం, శరీరంలో నీటి కొరత, అలెర్జీలు, మధుమేహం ఇతర సమస్యలున్న ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పదే పదే నెలల పాటు బూట్లు లేదా సాక్స్‌లను వినియోగించడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే  ఛాన్స్‌ ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యలున్న వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

పాదాలలో దురదను నివారించడానికి ఇలా చేయండి:
1. ఆపిల్ సైడర్ వెనిగర్:

పాదాలలో తీవ్రమైన దురద సమస్యలతో బాధపడేవారు ఆపిల్ సైడర్ వెనిగర్‌ను ఖచ్చితంగా తాగాల్సి ఉంటుంది. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

2. ఉప్పు నీరు:
రాళ్ల ఉప్పును నీటిలో కలుపుకుని తాగడం వల్ల కూడా పాదాల్లో దురద నుంచి ఉపశమనం పొందవచ్చు. ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు లభిస్తాయి. కాబట్టి ఇలా ఉప్పునీరు తాగడం వల్ల రక్త ప్రసరణను అదుపులో ఉంచుతుంది.

3. పెరుగు:
పెరుగులో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. చలి కాలంలో వచ్చే ఇన్ఫెక్షన్‌లను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా అరికాలి దురద తొలగించడానికి సహాయపడుతుంది. కాబట్టి తరచుగా ఇలాంటి సమస్యతో బాధపడేవారు తప్పకుండా పై చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Tax Saving Schemes 2023: ఈ పథకంలో పెట్టుబడి పెట్టండి.. ఆదాయంతోపాటు సూపర్ బెనిఫిట్స్  

Also Read: Shubman Gill: ఉప్పల్‌లో పరుగుల ఉప్పెన.. చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News