Joint Pain Relief: కండరాల, కీళ్ల నొప్పులు 40 ఏళ్ల తర్వాత ప్రారంభమైనప్పటికీ..కానీ ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది చిన్న వయసుల్లో ఈ నొప్పులతో బాధపడుతున్నారు. అంతేకాకుండా భారత్‌లో 25 నుంచి 30 సంవత్సరాల వయస్సులో ఉన్నవారు ఎక్కువగా ఈ నొప్పుల బారిన పడడం విశేషం. అయితే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఆధునిక జీవన శైలేనని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జీవన శైలిలో మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల సులభంగా ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
కీళ్ల నొప్పులకు ఇంటి నివారణలు:
తరచుగా కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు తప్పకుండా నొప్పి ఉన్న చోట ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ స్ప్రేను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో నొప్పులు సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా చర్మ సమస్యలు కూడా తగ్గుతాయని ఆయుర్వేద శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలో..దానిని నొప్పులు తగ్గించుకోవడానికి ఎక్కడ అప్లై చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
కీళ్ల నొప్పుల స్ప్రే కోసం కావాల్సిన పదార్థాలు:
>>ఆలివ్ ఆయిల్
>>10 టీస్పూన్ల ఉప్పు
>>కప్పు నీరు
>>స్ప్రే బాటిల్
తయారీ పద్దతి:
ముందుగా 10 టీస్పూన్ల ఉప్పు తీసుకుని కప్పు నీటిలో వేసుకోవాలి. ఆ తర్వాత ఈ నీటిని స్ప్రే బాటిల్‌లో పోసుకోవాలి. అయితే ప్రతి రోజూ 5 నిమిషాల పాటు ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత ఏదైనా చర్మంపై పొక్కులా వస్తే దానిపై ఈ ఉప్పునీటిని స్ప్రే చేసి మంచి నీటితో కడగాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా చేస్తే సులభంగా ఆ నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read : Bigg Boss 6 Telugu Winner : బిగ్ బాస్ విన్నర్ రేవంత్.. హింట్ ఇచ్చేసిన ప్రభాకర్, శివ బాలాజీ
Also Read : Vishnu Vishal Ravi Teja : కథ ఇవ్వమని రవితేజ అడిగినా నో అని చెప్పా : విష్ణు విశాల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook