Astrology: మీరు నిద్రించే విధానాన్ని బట్టి మీ భవిష్యత్తు తెలుసుకోవచ్చు..!

Astrology by Sleeping posture in Telugu: మానవ సమాజంలో వ్యక్తి వ్యక్తిత్వం, అలవాట్లు, భవిష్యత్తు మొదలైనవాటిని తెలుసుకోవడానికి జ్యోతిషశాస్త్రం, సంఖ్యాశాస్త్రం, హస్తసాముద్రికం, సముద్ర శాస్త్రాను కనుగొన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 1, 2022, 11:23 AM IST
  • మీరు నిద్రించే విధానాన్ని బట్టి మీ భవిష్యత్తు తెలుసుకోవచ్చు
  • తెలిపిన జ్యోతిషశాస్త్రం, సంఖ్యాశాస్త్రం
  • ఒకవైపు నిద్రపోయేవారు ఆత్మవిశ్వాసంతో జీవిస్తారు
Astrology: మీరు నిద్రించే విధానాన్ని బట్టి మీ భవిష్యత్తు తెలుసుకోవచ్చు..!

Astrology by Sleeping posture in Telugu: మానవ సమాజంలో వ్యక్తి వ్యక్తిత్వం, అలవాట్లు, భవిష్యత్తు మొదలైనవాటిని తెలుసుకోవడానికి జ్యోతిషశాస్త్రం, సంఖ్యాశాస్త్రం, హస్తసాముద్రికం, సముద్ర శాస్త్రాను కనుగొన్నారు. ఈ శాస్త్రాలను ఆధారంగా చేసుకొని వ్యక్తుల భవిష్యత్తును అంచన వేయోచ్చని నిపుణులు తెలిపారు. అంతే కాకుండా వ్యక్తులు పడుకునే స్టైల్ నుంచి అతని భవిష్యత్తును తెలుసుకోవచ్చని జ్యోతిషశాస్త్రం పేర్కొంది. రాత్రి, మధ్యాహ్న సమయంలో ఒక వ్యక్తి తన శరీరానికి విశ్రాంతిని ఇచ్చినప్పుడు, అతను ఓ ప్రత్యేక శైలిలో నిద్రపోతాడు. అతని నిద్ర విధానం అతని స్వభావం, ప్రవర్తన, భవిష్యత్తును నిర్ణయిస్తుందని శాస్త్రం సూచించింది.

నిద్రపోతున్న వ్యక్తి స్వభావం, భవిష్యత్తును శాస్త్రం ఎలా నిర్ణయిస్తుందో తెలుసుకుందాం:

#జ్యోతిషశాస్త్రం తెలిపిన వివరాల ప్రకారం...రాత్రి వేళల్లో నిద్రపోయేటప్పుడు చేతులు వెనక్కు పెట్టుకుని పడుకునే వారికి కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపన ఎక్కువగా ఉంటుంది. వారు తమ కుటుంబంపై అధిక ప్రేమను చూపిస్తారని శాస్త్రం తెలిపింది.

#కాళ్లూ, శరీరాన్నీ ముడుకుని నిద్రించేవాళ్లు జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొవాల్సి వస్తుందని.. అయితే అంతే మొత్తంలో సమస్యలను సులువుగా ఎదుర్కొనే నైపుణ్యాలు కూడా ఉంటాయని శాస్త్రం సూచించింది.

#శరీరం కుంచించుకుపోయి నిద్రపోయేవారు చాలా భయపడతారని.. వీరు తెలియని వ్యక్తులతో మాట్లాడటానికి భయపడతారని శాస్త్రం తెలిపింది.

#కొందరు సాధరణంగా కాళ్లు పట్టుకుని నిద్రపోతూ ఉంటారు. వీరికి స్వార్థం అధికంగా ఉంటుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. అంతే కాకుండా వీరు జీవితంలో అధికంగా కష్ట పడి పని చేసి..ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని శాస్త్రం తెలిపింది.

#నిటారుగా నిద్రపోయే వ్యక్తులు సాధారణంగా తమ సమస్యలకు తామే పరిష్కారం కనుగొంటారని.. వాళ్లు నమ్మకంతో జీవిస్తారని శాస్త్రం పేర్కొంది.

#రాత్రి పూట ఎలాంటి మెలుకవ లేకండా నిద్రపోయే వారు తమ లక్ష్యాలను సాధించడంలో నిమగ్నమై ఉంటారని శాస్త్ర నిపుణులు తెలిపారు.

#శరీరమంతా దుప్పటి కప్పుకుని నిద్రించే వారు అన్ని విషయాల్లో సిగ్గుపడతారని.. వీరు తమ రహస్యాలను ఎవరికీ చెప్పుకునేందుకు ఇష్టపడరని జ్యోతిషశాస్త్రం చెబుతోంది.

# ఒకవైపు నిద్రపోయేవారు ఆత్మవిశ్వాసంతో జీవిస్తారని..  వీరు అనుకున్నది చేయగలుగుతారని శాస్త్రం తెలిపింది.

Also Read: Yadadri Parking Fee: యాదాద్రికి కారులో వెళ్తున్నారా.. పార్కింగ్ ఫీజు తెలిస్తే చుక్కలు కనిపించడం ఖాయం..

Also Read: Weight Loss Drink: బరువు తగ్గటానికి ఈ 3 డ్రింక్స్ ట్రై చేశారా..? చేయకపోతే వెంటనే తాగండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News