Korean Drink for weight loss: ఈ ఒక్క కొరియన్ బెల్లీఫ్యాట్‌ డ్రింక్ తాగితే చాలు.. అదనపు కొవ్వు అమాంతం మాయమైపోతుంది..

Korean Drink for weight loss: ఈ కాలంలో బెల్లీ ఫ్యాట్ తో చాలామంది బాధపడుతున్నారు. దీనికి రకరకాలుగా ఎక్సర్సైజులు చేయడం డైట్ లో మార్పులు చేసుకోవడం వంటివి చేస్తున్నారు. అయితే కొన్ని రకాల ఆహారాలతో బెల్లీ ఫ్యాట్‌ ఇట్టే కరిగిపోతుంది.

Written by - Renuka Godugu | Last Updated : Jun 13, 2024, 06:54 PM IST
Korean Drink for weight loss: ఈ ఒక్క కొరియన్ బెల్లీఫ్యాట్‌ డ్రింక్ తాగితే చాలు.. అదనపు కొవ్వు అమాంతం మాయమైపోతుంది..

Korean Drink for weight loss: ఈ కాలంలో బెల్లీ ఫ్యాట్ తో చాలామంది బాధపడుతున్నారు. దీనికి రకరకాలుగా ఎక్సర్సైజులు చేయడం డైట్ లో మార్పులు చేసుకోవడం వంటివి చేస్తున్నారు. అయితే కొన్ని రకాల ఆహారాలతో బెల్లీ ఫ్యాట్‌ ఇట్టే కరిగిపోతుంది. ముఖ్యంగా ఈ 5 రకాల కొరియన్ డ్రింక్స్‌ తాగటం వల్ల బెల్లీఫ్యాట్‌ అమాంతం తగ్గిపోతుంది. అవి ఏంటో తెలుసుకుందాం.

బార్లీ టీ..
ఈ బార్లీ టీ ని కొరియన్ లో బోరిచా అంటారు. ఇది కెఫెన్ లేకుండా ఉండే పానీయం. దీన్ని చల్లగా లేకపోతే వేడిగా తీసుకోవచ్చు. బార్లీని వేయించి తయారు చేస్తారు. ఇందులో అనేక అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. కాస్త ఛేదుగా ఉంటుంది కానీ బరువు తగ్గడానికి ఎఫెక్టీవ్ రెమిడీ. నీరసం, మంట సమస్యను కూడా తగ్గిస్తుంది. డయేరియా కు ఎఫెక్టివ్ రెమిడీ.

గ్రీన్ టీ..
గ్రీన్ టీ ని నొక్చా అని కూడా అంటారు. బ్రౌన్ రైస్ వేయించి గ్రీన్ టీతో తయారుచేస్తారు. దీన్ని బ్లెండ్ చేసి తీసుకుంటారు గ్రీన్ టీ ఆకులు, బ్రౌన్ రైస్ రెండిటిని కలిపి బాగా బ్లెండ్ చేసి డ్రింక్ తయారు చేస్తారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి డిటాక్స్ఫికేషన్ కు సహాయపడతాయి. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారికి ఇది ఎఫెక్టీవ్
రెమిడీ.

ఇదీ చదవండి: ఈ 6 వంటగది వస్తువులతో కూడా షుగర్ తగ్గించుకోవచ్చు..

అల్లం టీ..
అల్లం టీ ని ఈ సంప్రదాయ సోయం గంఛా అని కూడా పిలుస్తారు. ఇది అల్లం, బాదం, జుజుబి తో తయారు చేస్తారు. ఈ ఆరోగ్యకరమైన డ్రింక్ తీసుకోవడం వల్ల జలుబు, ఫ్లూ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బాడిని డిటాక్సిఫై చేస్తాయి.

తామర టీ..
 ఈ వైల్డ్ హెర్బల్ టీ కొరియన్ లో పాపులర్ తెల్ల తామర పూల ఆకులతో తయారుచేస్తారు. ఇందులో చైనీస్ సంప్రదాయ గుణాలు కూడా ఉంటాయి. ఇందులో విటమిన్ బి, క్యాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తాన్ని ప్యూరిఫై చేసి మంచి నిద్రకు ఉపక్రమించేలా చేస్తాయి ఈ టీ లో విటమిన్ సి ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి.

ఇదీ చదవండి: లవంగం ఇలా తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు.. అది ఎలానో తెలుసా?

రోజ్ టీ..
 ఈరోజు టిని గుల్చా రోజ్ టీ అని కూడా పిలుస్తారు. వెయిట్ లాస్ లో జర్నీలో ఉన్నవారికి ఇది మంచి రెమిటి రోజ్ పెటల్స్ కుంకుమపూవు బ్లెండ్ చేసి తయారు చేస్తారు. ఈ కొరియన్ డ్రింక్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఫ్లేవర్ నాయిడ్స్ కూడా ఉండటం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది ఆరోగ్యకరమైన శరీరానికి సహాయపడుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News