Lemongrass Benefits: లెమన్‌గ్రాస్ మొక్క శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి చాలా మంది దీనిని వినియోగిస్తారు. అయితే ప్రస్తుతం దీని తయారు చేసిన టీలను కూడా విచ్చల విడిగా వినియోగిస్తున్నారు. ఈ టీని ప్రతి రోజూ తాగడం వల్ల శరీరానికి చాలా లాభాలు చేకూరుతాయి. ముఖ్యంగా శరీర బరువును నియంత్రించడానికి సహాయపడుతుంది. అయితే ఇంటి దగ్గర గార్డెన్ ఏరియాలో ఉండే కుండిల్లో ఈ మొక్కలను నాటడం వల్ల దోమల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. దీని ఇంట్లో నాటడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయి.
లెమన్‌గ్రాస్ నూనె ఉత్పత్తి:
ప్రతి సంవత్సరం భారతదేశంలో 700 టన్నుల లెమన్‌గ్రాస్ నూనెను ఉత్పత్తి చేస్తున్నారు. ఇలా ఉత్పత్తి చేసిన ఆయిల్‌ని టీతో పాటు, తలనొప్పి మందులకు కూడా వినియోగిస్తున్నారని సమాచారం. అయితే ఇందులో ఉండే గుణాలు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచేందుకు కూడా సహాయపడుతుంది. అయితే భారత్‌లో కాకుండా ఇతర దేశాల్లో పెద్ద ఎత్తున పెర్ఫ్యూమ్ పరిశ్రమల్లో కూడా వినియోగిస్తున్నారు.
లెమన్‌గ్రాస్ ప్రయోజనాలు:
లెమన్‌గ్రాస్ ఆయిల్ వినియోగిస్తే శరీర రోగనిరోధక శక్తిని పెరగడమేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, భాస్వరం, ప్రోటీన్, కొవ్వు, సోడియం, విటమిన్లు, జింక్ లభిస్తాయి. కాబట్టి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను సులభంగా నియంత్రిస్తాయి. అంతేకాకుండా దీర్ఘకాలీక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కాబట్టి శరీరాన్ని నిర్విషీకరణ చేసి వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: IND vs BAN: 25 ఏళ్ల తర్వాత.. రాహుల్ ద్రవిడ్‌కు అలన్ డొనాల్డ్ క్షమాపణలు! డిన్నర్‌కి కూడా పిలిచాడు
Also Read: Sun Transit 2022: నేడే త్రిగ్రాహి యోగం.. ఈ 5 రాశుల వారు అదృష్టవంతులు! లెక్కలేనంత డబ్బు మీ సొంతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Lemongrass Benefits: 90% మందికి లెమన్‌గ్రాస్‌తో ఈ తీవ్ర వ్యాధుల నుంచి ఉపశమనం పొందరు.. మీరు వినియోగించారా..?