Summer diet: ఎండా కాలంలో శరీరం ఇట్టే డీహైడ్రేషన్ కు గురవుతుంది. కాబట్టి వేసవిలో మీ బాడీలో తగినంత నీరు ఉండేటట్లు చూసుకోవాలి, లేకపోతే మీరు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు మార్కెట్లో చాలా రకాల పళ్లు ఉన్నాయి. వీటిని తప్పనిసరిగా డైట్ లో చేర్చుకోవడం వల్ల మీ శరీరానికి తగినంత నీరు, పోషకాలు అంది మీరు హెల్తీగా ఉంటారు. సమ్మర్ తప్పక తినాల్సిన ఫ్రూట్స్ ఏవో తెలుసుకుందాం.
మామిడి పండ్లు
వేసవిలో ఎక్కువగా దొరికే పళ్లలో మామిడి ఒకటి. మ్యాంగోలో ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ పండులో యాంటీయాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. మీ కంటి చూపు మెరుగుపరచడంతోపాటు ఆరోగ్యంగా ఉంచుతాయి.
పుచ్చకాయ
ఈ సీజన్ లో విరివిగా లభించే పళ్లలో పుచ్చకాయ ఒకటి. ఇది 90 శాతం నీటితో నిండి ఉంటుంది. దీనిలో పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ పండు గుండె జబ్బుల నివారణలో అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మీ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.
స్ట్రాబెర్రీ
స్ట్రాబెర్రీలలో విటమిన్ సి, మాంగనీస్, ఫోలేట్, పొటాషియం, బి విటమిన్లు మరియు ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. స్ట్రాబెర్రీస్‌లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, దీనిని తీసుకోవడం వల్ల మీకు జీర్ణసమస్యలు రావు.
Also Read: Best Summer Holiday Places: సమ్మర్ లో వెళ్లాల్సిన టాప్-5 ప్రదేశాలు ఇవే...!
ఫైనాపిల్
ఈ పండును తినడంతపాటు జ్యూస్ కూడా ఉపయోగిస్తారు. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మీ కణాలను రిపేర్ చేయడంతోపాటు ఇమ్యూనిటీని పెంచుతుంది. పైనాపిల్‌లో మాంగనీస్ అధికంగా ఉండటం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. దీనిని సలాడ్ కింద కూడా ఉపయోగిస్తారు.
ఆపిల్
ఆపిల్ రుచికరమైన పోషకాలు అధికంగా ఉండే పండు. ఇది దాదాపు అన్ని సీజన్లలోనూ లభిస్తుంది. దీని తీసుకోవడం వల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది మీ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. మీ చర్మానికి నిగారింపును ఇస్తుంది. మీ జీవక్రియ మెరుగుపడుతుంది.
Also Read: Chia Seeds Side Effects: అతిగా చియా సీడ్స్ వినియోగిస్తున్నారా? అయితే ఇది గుర్తుంచుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook