Summer Holiday Destinations in India: ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. దీంతో చాలా మంది ఉదయం 9 గంటల దాటితే ఇళ్లకే పరిమితమవుతున్నారు. మీరు వేడి నుంచి తప్పించుకోవాలంటే ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీతో కలిసి ఈ ప్రదేశాలకు వెళ్లండి. వేసవిలో సందర్శించాల్సిన ఇండియాలో బెస్ట్ ప్లేసెస్ ఏంటో తెలుసుకుందాం.
టాప్-5 సమ్మర్ హాలిడే డెస్టినేషన్స్:
1. సిమ్లా
వేసవిలో కూడా సిమ్లాలో చల్లటి వాతావరణం ఉంటుంది. కల్కా నుండి సిమ్లా వరకు టాయ్ ట్రైన్ జర్నీ అయితే అద్భుతంగా ఉంటుంది. షాపింగ్ కు అక్కడి మాల్ రోడ్ బెస్ట్ ఫ్లేస్. ఇక్కడ ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. మీరు అక్కడ వాటర్ రాఫ్టింగ్, పారా గ్లైడింగ్ వంటి అడ్వాంచర్స్ చేయవచ్చు. ఇక్కడకు చేరుకోవడానికి దగ్గరగా ఉన్న విమానాశ్రయం చండీగడ్.
2. మనాలి
సమ్మర్ లో వెళ్లాల్సిన ప్రదేశాల్లో ఇది ఒకటి. మనాలి ఎంతో అందంగా ఉంటుంది. చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు, బియాస్ నది అందాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి. ట్రెక్కింగ్, రివర్ రాఫ్టింగ్, పారాగ్లైడింగ్, జోర్బింగ్ వంటివి ట్రై చేయవచ్చు. ఇక్కడ చూడటానికి హడింబా టెంపుల్, సోలాంగ్ వ్యాలీ, రోహితంగ్ కనుమ, మణికరణ్ గురుద్వారా, జోగిని జలపాతం మెుదలైనవి ఉన్నాయి. దీనికి దగ్గరలో గల ఎయిర్ ఫోర్ట్ భుంటార్. దీని సమీప రైల్వేస్టేషన్ చండీగఢ్.
3. అండమాన్ నికోబార్
ఎండా కాలంలో వెళ్లాల్సిన ప్లేసెస్ లో అండమాన్ ఒకటి. ఇక్కడ బీచ్ అందాలు మిమ్మల్ని కట్టిపడేస్తాయి. ఇక్కడ పోర్ట్ బ్లెయిర్, హేవ్‌లాక్ ద్వీపం, నీల్ ఐలాండ్ మరియు రాధానగర్ బీచ్‌లను సందర్శించండి. స్కూబా డైవింగ్, స్నూర్క్ లింగ్ వంటి సాహాస క్రీడలు చేయడానికి ఇది మంచి ప్రదేశం. మనదేశంలో ఏకైక క్రియాశీల అగ్నిపర్వతమైన బారెన్ ఐలాండ్ ఇక్కడే ఉంది. ఇక్కడ సూర్యదయం మరియు సూర్యాస్తమయం చాలా బాగుంటాయి. కోల్‌కతా మరియు చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్‌కు విమానాలు నడుస్తాయి. అంతేకాకుండా క్రూయిజ్ సదుపాయాలు కూడా ఉన్నాయి.
4. డార్జిలింగ్
ఇది పశ్చిమ బెంగాల్ లో ఉంది. ఇక్కడ లభించే టీ వరల్డ్ ఫేమస్. వేసవిలో ఇక్కడకు వెళ్లడం మంచి ఆప్షన్. కొండల మధ్య ప్రయాణించే ట్రాయ్ జర్నీ చాలా బాగుంటుంది. ఇక్కడి టీ ఎస్టేట్స్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. టైగర్ హీల్ లో సూర్యోదయం చూడటం మంచి అనుభూతి. డార్జిలింగ్ లో చూడాల్సిన ప్రదేశాలలో పద్మజానాయుడు జులాజికల్ పార్కు కూడా ఒకటి. ఇక్కడికి చేరుకోవడానికి సమీప రైల్వేస్టేషన్ జల్పైగురి. దీనికి దగ్గర ఎయిర్ ఫోర్ట్ సిలిగురి.
5. మున్నార్
కేరళలో గల అందమైన హిల్ స్టేషన్ మున్నార్. పశ్ఛిమ కనుమలలో ఉన్న ఈ ప్రదేశం మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడి తేయాకు తోటల అందం మిమ్మల్ని మైమరచిపోయేలా చేస్తుంది. కుండలా సరస్సు, ఎకో పాయింట్ మరియు ఎలిఫెంట్ లేక్‌లు ఆకట్టుకుంటాయి. అనైముడి ట్రైక్, టాటా టీ మ్యూజియం మీకు సరికొత్త అనుభూతిని పంచుతాయి. విమానాల ద్వారా వచ్చే వారికి ముందుగా కొచ్చి ఎయిర్ ఫోర్టుకు చేరుకోవాలి. రైలు ద్వారా వచ్చేవారు ఎర్నాకులం రావాలి.
Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్ జాయ్ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి