Makka Gatka Recipe: మక్క గటక తెలంగాణ ప్రసిద్ధి వంటకం.. ఇది దాదాపు కొన్ని ఏళ్ల నుంచి వస్తున్న ప్రత్యేకమైన రెసిపీ. దీనిని మక్కా రవ్వతో పాటు పిండిని వినియోగించి తయారు చేస్తారు. ప్రతిరోజు అల్పాహారంలో భాగంగా ఈ మొక్క గటక తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు శరీర బరువును తగ్గించేందుకు ఎంతగానో సహాయపడతాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజు దీనిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల అతి తొందరలోనే మంచి ఫలితాలు పొందవచ్చు. తెలంగాణలోని కొన్ని పల్లెల్లో ఇప్పటికీ ఈ మొక్క గటక అల్పాహారంగా వినియోగిస్తున్నారు. అందుకే పల్లె ప్రాంతాల్లో జీవించేవారు ఎక్కువగా శక్తివంతంగా ఉంటారు. అయితే మీరు కూడా ప్రతిరోజు అల్పాహారంలో భాగంగా మొక్క గటక తీసుకోవాలనుకుంటున్నారా? కోసం సులభమైన తయారీ పద్ధతిని అందించబోతున్నాం..
తెలంగాణ స్టైల్ మక్క గటక రెసిపీకి కావలసిన పదార్థాలు:
✤ 1 కప్పు మక్క రవ్వ
✤ 3 కప్పుల నీరు
✤ 1/2 టీస్పూన్ ఉప్పు
✤ 1/4 టీస్పూన్ పసుపు
✤ 1 టేబుల్ స్పూన్ నెయ్యి
✤ 1/2 టీస్పూన్ జీలకర్ర
✤ 1/4 టీస్పూన్ మెంతులు
✤ 1/2 టీస్పూన్ ఆవాలు
✤ 1/4 కప్పు తరిగిన ఉల్లిపాయ
✤ 1/2 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
✤ 1/2 టీస్పూన్ కారం
✤ 1/4 టీస్పూన్ గరం మసాలా
✤ 1/4 కప్పు తరిగిన కొత్తిమీర
తయారీ విధానం:
✤ ఈ మొక్క ఘటన తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకోవాల్సి ఉంటుంది.
✤ ఈ బౌల్ ని స్తవ్ పై పెట్టి అందులో కొన్ని నీటిని పోసుకొని ఉప్పు, పసుపు వేసి బాగా మరిగించాల్సి ఉంటుంది.
✤ నీరు మరిగిన తర్వాత మక్క గట్క వేసి, ఉప్మా లాగా దగ్గర పడేంత వరకు బాగా ఉడకనివ్వాలి. దగ్గర పడ్డ తర్వాత స్టవ్ చిన్నగా పెట్టుకొని మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
✤ తర్వాత ఒక ఫ్యాన్‌లో నెయ్యి వేడి చేసి జీలకర్ర మెంతులు ఆవాలు వేసి బాగా వేయించుకోవాల్సి ఉంటుంది.
✤ ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఉల్లిపాయను వేసుకుని అవి గోధుమ రంగు వచ్చేంతవరకు బాగా వేయించుకోవలసి ఉంటుంది.
✤ తర్వాత అందులోని తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం గరంమసాలా వేసి మరో ఐదు నిమిషాల పాటు నెమ్మదిగా వేయించుకోవాలి.
✤ ఇలా పోపు పెట్టుకున్న మిశ్రమాన్ని ఉడికిన మక్క గడకలో మిక్స్ చేసి పైనుంచి కొత్తిమీర గార్నిష్ చేసుకొని వేడివేడిగా వడ్డించుకుంటే భలే ఉంటుంది.
చిట్కాలు:
✤ ఈ మక్క గడప మరింత రుచిగా ఉండడానికి ఇందులో తప్పు లేదా కూరగాయలను కూడా యాడ్ చేసుకోవచ్చు.
✤ అలాగే ఇందులో పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవడం వల్ల మరింత టెస్ట్ను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.
✤ ఈ మక్క గడపను ఉడికించి రిఫ్రిజిరేటర్ లో కూడా నిలువ చేసుకొని వారాల తరబడి తీసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి