Mamidikaya Pulihora Recipe: ప్రతి దేవుడికి భారతీయులు పులిహోరను నైవేద్యంగా పెడుతూ ఉంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా పులిహోరను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు అయితే భారత దేశంలో ఈ వంటకాన్ని ఒక్కొక్క రాష్ట్ర ప్రజలు ఒక్కొక్కలా తయారు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో పులిహోర చింతపండుతో తయారు చేసుకుంటే, మరి కొంతమంది మాత్రం నిమ్మకాయతో తయారు చేసుకుంటూ ఉంటారు. నిజానికి చింతపండు పులిహోర ఎంతో టెస్ట్ ఉన్నప్పటికీ, అప్పటికప్పుడు చేసుకోవడానికి చాలా కష్టమే.. ఇక తెలంగాణ విషయానికొస్తే, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో చింతపండు పులిహోర చేసుకుంటే మరికొన్ని జిల్లాలో మాత్రం పుల్లని మామిడికాయలతో దీనిని తయారు చేసుకుంటారు. నిజానికి మామిడికాయలతో తయారుచేసిన పులిహోర చింతపండుతో చేసిన దానికంటే చాలా రెట్టింపుగా ఉంటుంది. అయితే మీరు కూడా ఇంట్లోనే తెలంగాణ స్టైల్ మామిడికాయ పులిహోర తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం మీ మందించే ఈ పద్ధతులతో సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోండి.
మామిడికాయ పులిహోర రెసిపీకి కావలసిన పదార్థాలు:
❁ 4 కప్పుల బియ్యం
❁ 1 పెద్ద ముక్క మామిడికాయ (పచ్చిది)
❁ 1/2 టీస్పూన్ పసుపు
❁ 1/4 టీస్పూన్ జీలకర్ర
❁ 1/4 టీస్పూన్ మెంతులు
❁ 1/2 టీస్పూన్ ఎండు మిరపకాయ
❁ 1 టేబుల్ స్పూన్ నెయ్యి
❁ 1 టేబుల్ స్పూన్ వేరుశెనగ నూనె
❁ 1 టీస్పూన్ ఆవాలు
❁ 10-12 కరివేపాకు ఆకులు
❁ 1 టీస్పూన్ పచ్చిమిర్చి ముక్కలు
❁ ఉప్పు రుచికి సరిపడా
తయారీ విధానం:
❁ మామిడికాయ పులిహోర తయారు చేసుకోవడానికి బియ్యాన్ని కడిగి, 30 నిమిషాల పాటు నానబెట్టండి.
❁ ఆ తర్వాత ఒక పెద్ద మామిడికాయను తీసుకొని మిక్సీ గ్రైండర్లో వేసి మిశ్రమంలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
❁ ఒక పాన్‌లో నెయ్యి వేడి చేసి, జీలకర్ర, మెంతులు, ఎండు మిరపకాయ వేసి వేయించాలి.
❁ ఆ తర్వాత అదే పాన్ లో ఆవాలు, కరివేపాకు ఆకులు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
❁ అవన్నీ బాగా వేగిన తర్వాత పసుపు, ఉప్పు వేసి కలపాలి.
❁ తర్వాత తురిమిన మామిడికాయ వేసి, 5 నిమిషాల పాటు ఉడికించాలి.
❁ నానబెట్టిన బియ్యాన్ని నీటితో పాటు పాన్‌లో వేసి, బాగా కలపాలి.
❁ తర్వాత 20 నుంచి 25 నిమిషాల పాటు బియ్యం ఉడికించాలి.
❁ ఒకసారి బియ్యం ఉడికిన తర్వాత, కిందకి దించి, 10 నిమిషాల పాటు చల్లారనివ్వండి.
❁ ఒకసారి చల్లారిన తర్వాత, పులిహోరను ఒక గిన్నెలో మళ్లీ ఒకసారి పోపు పెట్టుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
చిట్కాలు:
❁ మామిడికాయ పులిహోరను మరింత రుచిగా పొందడానికి పులిహోరలో కొన్ని కరివేపాకు ఆకులు, కొత్తిమీర ఆకులు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు.
❁ పులిహోర మరింత పుల్లగా తయారు చేసుకోవడానికి మామిడికాయలు ఎక్కువగా పులుపు ఉండేవి పెంచుకోవడం చాలా మంచిది.
❁ అంతేకాకుండా మామిడికాయ మిశ్రమంతో పాటు పులిహోరలో నిమ్మ రసాన్ని కూడా కలుపుకోవచ్చు.
❁ ఎండుమిరపకాయలు అంటే ఇష్టం ఉన్నవారు పులిహోరలో ఎక్కువగా వాటిని వినియోగించుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Mamidikaya Pulihora: తెలంగాణ స్టైల్ పుల్లని మామిడికాయ పులిహోర రెసిపీ.. 15 నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..