'రోబోట్'ను సృష్టించిన 11 ఏళ్ల చిచ్చర పిడుగు

ప్రతిభకు వయస్సు అడ్డంకాదని నిరూపించాడు 11 ఏళ్ల బాలుడు.

Last Updated : Feb 5, 2018, 03:57 PM IST
'రోబోట్'ను సృష్టించిన 11 ఏళ్ల చిచ్చర పిడుగు

మణిపూర్: ప్రతిభకు వయస్సు అడ్డంకాదని నిరూపించాడు 11 ఏళ్ల బాలుడు. యర్లపట్ లోని మెగా మణిపూర్ స్కూల్ లో 6వ తరగతి చదువుతున్న విద్యార్ధి వ్యర్థ ఎలక్ట్రానిక్ వస్తువులు, సిరంజిలు, మొబైల్ ఫోన్ భాగాలను ఉపయోగించి ఒక రోబోట్ ను తయారుచేసి అబ్బురపరిచాడు.  

ఉత్తర ఇంఫాల్, థింగ్నం లెకైకు చెందిన అభినందన్ దాస్ అనే 11 ఏళ్ల విద్యార్థి "నేను టీవీల్లో రోబోట్ గురించిన విషయాలను చూసిన తరువాత నాకు రోబోట్ ను తయారు చేయాలనే ప్రేరణ కలిగింది" అని ఏఎన్ఐకి చెప్పాడు.

దీనికి పేరేమి పెట్టావ్ అని అడిగితే..ఈ రోబోట్ కు మేగానంద్-18 అనే పేరు పెట్టానని చెప్పాడు. ఈ పేరులో 'మెగా'-మెగా మణిపూర్ స్కూల్ ను, 'ఆనంద్'-అభినందన్ ను, 18- 2018 ని సూచిస్తుందని తెలిపాడు. ఈ రోబోట్ ను ఎవరి సహాయమూ లేకుండా తయారు చేయడానికి ఆ విద్యార్థికి దాదాపు 15 నుంచి 20 రోజులు పట్టింది. తాను తయారుచేసిన రోబోట్ నీళ్ళగ్లాస్ పట్టుకుందని చూపించాడు.   

'రోబోట్ ను సిరంజిలు, హార్లిక్స్ బాటిల్స్,  ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్ భాగాలు, ఎల్ఈడీ దీపం, ఇతర వ్యర్థ పదార్థాలతో తయారు చేశాను' అని చెప్పాడు. రోబోట్ చేతులు కదలిక కోసం ఐవీ పైపుల ద్వారా ఒక హైడ్రాలిక్ వ్యవస్థను ఉపయోగించి సృష్టించానని అభినందన్ దాస్ వివరించాడు.

Trending News