Nellore Style Chepala Pulusu: అందరూ ఎంతగానో ఇష్టపడే చేపల పులుసుల్లో నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఒకటి. ఈ పులుసు రెసిపీ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే దీనిని చిన్నపిల్లల నుంచి పెద్ద వారి వరకు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఇది నోటికి అద్భుతమైన రుచి అందిస్తుంది అందుకే ఈ నెల్లూరు స్టైల్ చేపల పులుసుకి మంచి ఫ్యాన్ బేస్ లభించింది. అలాగే ఈ చేపలను ప్రస్తుతం పెద్ద పెద్ద రెస్టారెంట్లు మెయిన్ డిష్ గా పెడుతున్నాయంటే ఇక ఈ రెసిపీ గురించి చెప్పనక్కర్లేదు. ఈ నెల్లూరు చేపల పులుసును ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారు చేసుకుంటూ ఉంటారు. చాలామంది ఈ పులుసు తయారీ క్రమంలో పచ్చిమిర్చితో పాటు మామిడికాయలను ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు. ఇవి పులుసుకు మంచి టేస్ట్‌ను అందించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే చాలామంది ఎక్కువగా దీనిని రెస్టారెంట్లలో నుంచి ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు. ఇక నుంచి ఇలా చేయనక్కర్లేదు ఇంట్లోనే సులభంగా నెల్లూరు స్టైల్ చేపల పులుసు(Nellore Style Chepala Pulusu) తయారీ విధానాన్ని సులభమైన పద్ధతిలో ఈరోజు పరిచయం చేయబోతున్నాం. అయితే ఈ చేపల పులుసు తయారీకి కావలసిన పదార్థాలు ఏంటో? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
నెల్లూరు స్టైల్ చేపల పులుసుకు కావలసిన పదార్థాలు:
చేపలు - 1 కిలో
ఉల్లిపాయలు - 2 (పెద్దవి), తరిగినవి
టమోటాలు - 2 (పెద్దవి), తరిగినవి
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిరపకాయలు - 4-5, తరిగినవి
కరివేపాకు - 1 రెమ్మ
జీలకర్ర - 1 టీస్పూన్
శనగపిండి - 1 టేబుల్ స్పూన్
పసుపు - 1/2 టీస్పూన్
మిరపకాయలు - 2-3,
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 3 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - 1/2 కప్పు, తరిగినవి
తయారీ విధానం:
ముందుగా చేపలను తీసుకొని వాటిని బాగా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని ఉప్పు, పసుపు, మిరపకాయల పొడితో కడిగిన చేపలకు బాగా పట్టించి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత స్టౌవ్ పై ఒక పాన్ పెట్టుకుని, పాన్‌లో తగినంత నూనెను వేసుకొని బాగా వేడి చేసి అందులో జీలకర్ర వేసి వేయించాలి.
అలాగే ఇందులోనే తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయేవరకు వేయించాలి.
బాగా వేగిన తర్వాత తరిగిన టమోటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి మెత్తబడేవరకు ఉడికించాలి.
అందులోనే శనగపిండి, పసుపు, మిర్చి పౌడర్ వేసి బాగా కలపాలి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
కాస్త నీరు పోసి, మసాలా మంచి వాసన వచ్చేవరకు బాగా ఉడికించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఇందులోనే మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి మరో 20 నిమిషాల పాటు బాగా వేయించాలి.
ఇలా వేయించిన తర్వాత మసాజ్ చేసుకున్న చేపలను వేసుకొని గంట పెట్టకుండా బాగా కలుపుకొని మరో 10 నిమిషాల పాటు బాగా ఉడికించాల్సి ఉంటుంది.
ఇలా ఉడికిన తర్వాత పైనుంచి కొత్తిమీర గార్నిష్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే భలే రుచి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి