Onion Juice For Hair Growth: ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న జుట్టు సమస్యలు జుట్టు రాలడం ఒకటి. ఈ సమస్య ఎదుర్కొనే వారిలో ఎక్కువగా యువతే ఉంటున్నారని నిపుణులు చెబుతున్నారు. యుక్త వయసులో జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొంతమందిలో ఒత్తిడి వాతావరణ కాలుష్యం కారణంగా జుట్టు రాలితే.. మరికొంతమందిలో పోషకాహార లోపం జన్యుపరమైన సమస్యల కారణంగా కూడా రాలిపోతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యలతో బాధపడేవారు మార్కెట్లో లభించే ఖరీదైన షాంపులను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. వినియోగించడం వల్ల సమస్య ఏమాత్రం తగ్గకుండా రెట్టింపు అవుతోంది.
కొంతమంది అయితే జుట్టు రాలడం సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి హెయిర్ క్లినిక్ లకి వెళ్లి లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే ఆయుర్వేద నిపుణులు సూచించిన ఓ చిట్కాతో ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చట. నిపుణులు తెలిపిన ఓ పదార్థాన్ని జుట్టుకు రాస్తే జుట్టు రాలడం తప్పకుండా ఆగిపోతుందట. ఇంతకీ ఆ పదార్థం ఏంటి? ఆ పదార్థాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
జుట్టు రావడం సమస్యతో బాధపడుతున్నవారు ప్రతిరోజు ఎర్ర ఉల్లిపాయతో తయారు.. చేసిన మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కాకుండా దీనిని వినియోగించడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కూడా కలగవని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. రూపాయి ఖర్చు లేకుండా జుట్టు రాలడం తగ్గించుకునే చిట్కాల్లో ఇది ఒక ప్రధాన చిట్కా అని వారంటున్నారు. ఎర్ర ఉల్లిపాయ మిశ్రమాన్ని జుట్టు క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల కుదుళ్ళ నుంచి బలంగా మారుతుంది. అంతేకాకుండా తెల్ల జుట్టు సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల తలలో ఉన్న దురద కూడా సులభంగా తగ్గుతుంది. అంతే కాకుండా బట్టతలపై కూడా జుట్టు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు కుదుళ్లలో ఇన్ఫెక్షన్ ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఉల్లిపాయ నుంచి తయారుచేసిన మిశ్రమాన్ని వినియోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీనిని అప్లై చేయడం వల్ల జుట్లు చిట్లిపోవడం సన్నబడడం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter