Pachimirchi Pulusu Recipe In Telugu: తరచుగా కూరగాయలను తినడం వల్ల బోర్ కొడుతూ ఉంటుంది. దీని కారణంగా కొంతమంది కూరగాయలతో చేసిన కర్రీలను తినేందుకు ఇష్టపడరు. అయితే ఇలాంటి వారి కోసం ఓ కొత్త రెసిపీని పరిచయం చేయబోతున్నాం. అదేంటో కాదు తెలంగాణ ప్రాచీన వంటకం పచ్చిమిరపకాయ పులుసు. దీనిని తెలంగాణలోని కొన్ని జిల్లాల ప్రజలు పూర్వికుల రెసిపీగా పిలుస్తారు. ఈ రెసిపీ కి దాదాపు 80 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇంట్లో కూరగాయలు అయిపోయినప్పుడు, కూరగాయలు తిని తిని బోర్ కొడుతున్న వారు ఈ రెసిపీని సులభంగా తయారు చేసుకోవచ్చు. కేవలం దీనిని తయారు చేసుకోవడానికి కావాల్సిందల్లా పచ్చిమిరపకాయలే. మీ ఇంట్లో పచ్చిమిరపకాయలు ఉంటే చాలు ఈ తెలంగాణ స్టైల్ పచ్చిమిరపకాయ పులుసు సులభంగా రెడీ చేసుకోవచ్చు. అయితే మీరు కూడా ఈ రెసిపీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే..
పచ్చి మిరపకాయ పులుసు రెసిపీ కావాల్సిన పదార్థాలు:
✹ పచ్చి మిరపకాయలు - 10 చింతపండు - చిన్న ముద్ద
✹ పచ్చి కొబ్బరి తురుము - 1/4 కప్పు
✹ పెరుగు - 1/4 కప్పు
✹ ఉప్పు - రుచికి సరిపడా
✹ కరివేపాకు - రెండు రెమ్మలు
✹ జీలకర్ర - 1/2 టీస్పూన్
✹ ఆవాలు - 1/2 టీస్పూన్
✹ పచ్చిమిర్చి ముక్కలు - 2
✹ కరివేపాకు - రెండు రెమ్మలు
✹ నెయ్యి - 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం:
✹ ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో చింతపండును చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి. 1/2 కప్పు నీళ్ళు పోసి, 15 నిమిషాలు నానబెట్టాలి.
✹ పచ్చి మిరపకాయలను శుభ్రంగా కడిగి, చిన్న ముక్కలుగా కట్లు పెట్టి ఒక గిన్నెలో పెట్టుకోవాల్సి ఉంటుంది.
✹ ఒక గిన్నెలో పచ్చి కొబ్బరి తురుము, పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి.
✹ నానబెట్టిన చింతపండు ముక్కలను నీళ్లతో పాటు ఒక మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
✹ ఆ తర్వాత ఒక పాన్‌లో నెయ్యి వేసి వేడెక్కాక, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
✹ వేయించిన పచ్చిమిర్చి మసాలాను పెరుగు మిశ్రమంలో వేసి బాగా కలపాలి.
✹ ఆ తర్వాత రుబ్బిన చింతపండు రసం, కట్ చేసిన పచ్చి మిరపకాయ ముక్కలను కూడా పెరుగు మిశ్రమంలో వేసి బాగా కలపాలి.
✹ చివరగా కరివేపాకుతో అలంకరించి, వేడిగా అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.
చిట్కాలు:
✹ ఈ కూరను మరింత రుచి పొందడానికి పచ్చి పులుసులో కొద్దిగా ఇంగువ కూడా వేయవచ్చు.
✹ పచ్చి మిరపకాయలకు బదులుగా, మీరు ఎండు మిరపకాయలను వినియోగించడంల వల్ల మరింత రుచి పెరుగుతుంది.
✹ పచ్చి పులుసును మరింత చిక్కగా చేసుకునేందుకు కొద్దిగా పెసరపప్పు పిండిని కూడా కలుపుకోవచ్చు.
పోషక విలువలు:
పచ్చి మిరపకాయ పులుసులో విటమిన్ సి, ఐరన్, పొటాషియం, ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా తింటే జీర్ణక్రియకు చాలా మంచిది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి