Pear Side Effects: ఈ జబ్బులు ఉన్నవారు పొరపాటున కూడా ఈ పండు తినకండి.. తింటే అంతే..!

Pear Side Effects: పియర్ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ ప్రూట్ అధికంగా తినడం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2023, 05:09 PM IST
Pear Side Effects: ఈ జబ్బులు ఉన్నవారు పొరపాటున కూడా ఈ పండు తినకండి.. తింటే అంతే..!

Who Should Not Eat Pear: చూడటానికి జామ కాయలా కనిపంచే మన పండును తెలుగులో బేరీ ప్రూట్ అంటారు. ఇది తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ పండులో ఫైబర్, విటమిన్లు మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉంటాయి. అయితే ఈ ప్రూట్ తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. 

ఇలాంటి వారు పియర్స్ తినకండి..
1. మీరు అజీర్తి సమస్యతో బాధపడుతుంటే ఈ బేరీ పండును తినకుండా ఉండటం మంచిది. ఎందుకంటే దీనిన తిన్న తర్వాత మీ  జీర్ణక్రియలో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ ఫ్రూట్ ను మార్నింగ్, నైట్ తినవద్దు. ఒక వేళ దానిని తీసుకున్నట్లయితే మీరు గ్యాస్, తిమ్మిరి, అతిసారం వంటి వ్యాధుల బారిన పడతారు. 
2. పియర్ తినడం వల్ల మన శరీరం కూల్ అవుతుంది. అందుకే జలుబు, దగ్గు ఉన్నవారు వీటికి దూరంగా ఉంటే మంచిది. 
3. ఈ పండులో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి, ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఒకవేళ మీరు ఈ పండును ఎక్కువగా తీసుకున్నట్లయితే మీరు వైట్ పెరిగే అవకాశం ఉంది. 
4. హై బీపీ ఉన్నవారు ఈ పియర్ పండును తక్కువ మెుత్తంలో తీసుకోవాలి. మీరు దీనిని అధికంగా తీసుకున్నట్లయితే లాభం కంటే ఎక్కువగా నష్టమే ఉంటుంది. అంతేకాకుండా మూర్ఛ, మైకం మరియు శ్వాస సమస్యల బారిన పడే అవకాశం ఉంది. 

Also Read: Weight Loss Tea: స్పీడ్‌గా బెల్లీ ఫ్యాట్‌, బరువు తగ్గడానికి ఈ వైట్ టీ తాగండి చాలు.!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News