Reduce High Blood Pressure: అధిక రక్తపోటు తగ్గించే పొడి ఇదే, ఈ చిట్కాతో 5 నిమిషాల్లో మాయం!

How To Reduce High Blood Pressure Naturally At Home: ఆధునిక జీవనశైలి కారణంగా చాలామందిలో రక్తపోటు సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఆయుర్వేద నిపుణులు పేర్కొన్న పలు చిట్కాలను పాటించడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా గుండె సమస్యలు కూడా దూరమవుతాయి.  

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 1, 2023, 05:51 PM IST
Reduce High Blood Pressure: అధిక రక్తపోటు తగ్గించే పొడి ఇదే, ఈ చిట్కాతో 5 నిమిషాల్లో మాయం!

How To Reduce High Blood Pressure Naturally At Home: ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యల్లో అధిక రక్తపోటు సమస్యలు ప్రధానమైనవి. అయితే ఈ సమస్యల కారణంగా శరీరమంతా ఒక్కసారిగా దెబ్బతినడమే కాకుండా ప్రాణాంతకంగా కూడా మారవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా తెలిసిన ఆరోగ్య నిపుణులు ఈ వ్యాధిని సైలెంట్ కిల్లర్ వ్యాధిగా కూడా చెప్పుకుంటున్నారు. అయితే ఈ సమస్య రావడానికి ప్రధాన కారణాలు ఆధునిక జీవనశైలే కాకుండా రక్తంలో కొలెస్ట్రాల్ అధిక పరిమాణంలో పెరగడం కారణం కూడా ఒకటని నిపుణులు అంటున్నారు. కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా గుండెలోకి రక్తం అధిక స్పీడ్ లో పంపు చేస్తుంది. దీంతో గుండె సమస్యలే కాకుండా పక్షవాతం తీవ్ర ఇబ్బందులు కూడా తలెత్తే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు రక్తపోటు నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఉదయాన్నే లేచిన తర్వాత ప్రస్తుతం చాలామందిలో మెడ నొప్పులు తరచుగా మూత్ర విసర్జన, చేతుల్లో నొప్పులు, కండరాల బలహీనత, కంటి చూపు కోల్పోవడం, తల తిరగడం వంటి లక్షణాలతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతూ వారు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వైద్య నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆహారంతో పాటు జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సులభంగా చెడు కొలస్ట్రాల్ తో పాటు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

Also Read: Rohit Sharma-Yashasvi Jaiswal: టీమిండియాలోకి యశస్వి జైశ్వాల్‌.. హింట్‌ ఇచ్చిన కెప్టెన్ రోహిత్‌ శర్మ!

అంతేకాకుండా అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు తరచుగా మార్కెట్లో లభించే రకరకాల రసాయనాలతో కూడిన  ఔషధాలను వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల ఇప్పుడు ఎలాంటి సమస్యలు రాకపోయినా భవిష్యత్తులో మాత్రం తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. దీనికోసం ముందుగా మీరు పుచ్చకాయ గింజలను, గసగసాలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ చిట్కాతో అధిక రక్తపోటు సమస్యలకు చెక్:
ముందుగా పుచ్చకాయ గింజలను తీసుకోవాల్సి ఉంటుంది. ఒక కప్పు వాటిని తీసుకొని మిక్సీ జార్లో వేసి పొడిగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పొడిగా చేసుకున్న గింజలను కప్పులోకి తీసుకొని ఆ కప్పును పక్కన పెట్టాల్సి ఉంటుంది. అలాగే గసగసాలను కూడా తీసుకొని ఫైన్ గా పొడి చేసుకోవాలి. ఇలా రెండింటిని పొడిగా చేసుకున్న తర్వాత ఒక డబ్బాలో భద్రపరుచుకుని.. ఇది రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఆ పొడిని కలుపుకొని తాగడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Rohit Sharma-Yashasvi Jaiswal: టీమిండియాలోకి యశస్వి జైశ్వాల్‌.. హింట్‌ ఇచ్చిన కెప్టెన్ రోహిత్‌ శర్మ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News