Republic Day Rangoli Designs 2024: ఈ సంవత్సరం మనమంతా 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సమయంలో భారతీయులందరూ ఎంతో ఆసక్తితో ఇండియా గేట్ వద్ద జరిగే పరేడ్లను వీక్షిస్తూ ఉంటారు. అంతేకాకుండా దేశమంతా ప్రభుత్వ ఆఫీసుల్లో పాఠశాలలో ఎంతో ఘనంగా జెండా ఉత్సవాలు జరుపుకుంటారు. చాలామంది ఇంటిని రంగోలితో ఎంతో అందంగా అలంకరిస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం మీరు కూడా మీ ఇంటి ముందు వాకిలిని అందంగా అలంకరించుకోవాలనుకుంటున్నారా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జీ తెలుగు న్యూస్ కొన్ని రంగోలీలను మీ ముందుకు తెచ్చింది. ఆ రంగోలిలేంటో వాటిని ఎలా అలంకరించాలో పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ ముందుకు ఎంతో సులభంగా అలంకరించే గాలిపటం ముగ్గురు తీసుకువచ్చాము. ఈ ముగ్గును సులభంగా చుక్కల పద్ధతిలో కూడా వేయవచ్చు. నీకోసం ముందుగా మీరు చుక్కలను పెట్టుకొని వాటి గీతలను సరైన క్రమంలో కలపాల్సి ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత మూడు జెండా రంగులను ఫిల్ చేయాలి.
ఈ రంగోలిని అగ్గిపుల్లల సహాయంతో కూడా ఎంతో సులభంగా వెయ్యొచ్చు. దీనికోసం ముందుగా మూడు త్రివర్ణ కలర్స్ ని వాకిట్లో గుండ్రంగా పోసుకొని.. వాటిలో ఈ ఫోటోలో ఉన్న డిజైన్ లాగా అగ్గిపుల్లలతో నెమ్మదిగా గీయాల్సి ఉంటుంది.
డిజైన్ ని గాజుల సహాయంతో కూడా సులభంగా గీయవచ్చు దీనికోసం ముందుగా రెండు జతల గాజులను సేకరించి.. ఆ తర్వాత మూడు కలర్స్ తో అందంగా ముగ్గు వేసుకొని పక్కన డిజైన్స్‌ని గాజులతో అందంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా గీసుకున్న తర్వాత వాటిలో కూడా కలర్స్‌ని ఫిల్ చేయాలి.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
ఈ రంగోలిని వేయడం చాలా సులభం ముందుగా ఒక గుండ్రని ముగ్గురు వేసుకొని అందులో మూడు కలర్స్‌ని ఫిల్ చేసుకోవాలి. ముందుగా ఆరెంజ్ కలర్ ఫిల్ చేసుకుని, ఆ తర్వాత మధ్యలో వైట్ కలర్ ఫీల్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చివరగా గ్రీన్ కలర్ రంగోలి వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అన్ని కలర్స్ వేసుకున్న తర్వాత మళ్లీ మరోసారి సుద్ధతో ముగ్గును ఆనందంగా అలంకరించాల్సి ఉంటుంది.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter