Turmeric: ఈ వ్యాధులు ఉన్నా వారు పసువును అతిగా తీసుకుంటే.. ఇక అంతే సంగతి..

Side Effects Of Turmeric: పసుపును ఆయుర్వేదం యొక్క నిధిగా శాస్త్ర నిపుణులు పరిగణిస్తారు.  ఎందుకంటే ఇది మన శరీరానికి అనేక విధాలుగా సహాయపడుతుంది. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి దీనిని వినియోగిస్తారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 16, 2022, 04:44 PM IST
  • మధుమేహం, పచ్చకామెర్లు, మూత్రపిండాల్లో..
  • రాళ్లు ఉన్నవారు పసువును అతిగా ..
  • తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి.
Turmeric: ఈ వ్యాధులు ఉన్నా వారు పసువును అతిగా తీసుకుంటే.. ఇక అంతే సంగతి..

Side Effects Of Turmeric: పసుపును భారతీయులు ఎక్కువగా వంటల్లో వినియోగిస్తారు. వంటకాల రుచిని పెంచేందుకు సహాయపడుతుంది. ఇది ఆహార రుచిని పెంచడమే కాకుండా అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. పసుపులో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి దీనిని క్రమంగా వినియోగిస్తే శరీరంలోని రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా సీజనల్ వ్యాధులు సులభంగా నయమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ పసుపును తీసుకోకపోవడం చాలా మంచిది. వారు తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఒప్పందం అవుతాయో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.

మధుమేహం:
మధుమేహంతో బాధపడుతున్న వారు వివిధ రకాల ఔషధాలను వినియోగిస్తారు. ఈ ఔషధాలను వినియోగించే క్రమంలో పసుపుతో తయారు చేసిన టీలను కానీ ఇతర ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మధుమేహం తీవ్ర సమస్యగా మారే అవకాశాలు.

పచ్చకామెర్లు:
పచ్చకామర్ల సమస్యతో బాధపడుతున్న వారు వీలైనంతవరకు పసుపుతో తయారు చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఒకవేళ వీటిని తీసుకుంటే తప్పకుండా వైద్యుని సంప్రదించి తీసుకోవాల్సి ఉంటుంది అని నిపుణులు సూచిస్తున్నారు.

మూత్రపిండాల్లో రాళ్లు:
కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వారు పసుపుతో తయారు చేసిన ఆహారాలను తీసుకోకపోవడం చాలా మంచిది. వీటిని తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ల నొప్పులు అధికంగా పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి పసుపును అతిగా వినియోగించకపోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రక్తస్రావం:
చాలామందికి శరీర భాగాల్లోంచి రక్తస్రావం జరుగుతుంది. అయితే ఇలాంటి వారు కూడా పసుపును తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. పసుపులో ఉండే మూలకాలు శరీరంలో వేడి తీవ్రతను పెంచి వివిధ రకాల సమస్యలకు దారి తీయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Also Read : Kantara Telugu Movie Collections : ఒక్క రోజులోనే బ్రేక్ ఈవెన్.. ఫస్ట్ డే ఎంతంటే?

Also Read : Salaar Update : పృథ్వీరాజ్ భయంకరమైన లుక

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News