Summer Tips: వేసవిలో ఈ టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వండి.. లేదా ఆరోగ్య సమస్యలు తప్పవు..

Summer Lifestyle: వేసవికాలంలో మన అలవాట్లు మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అందుకనే వేసవికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. బయట ఎండ వేడి నుంచి.. మన శరీరాన్ని మనం కాపాడుకోవడం కోసం కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవడం ఉత్తమం.  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 3, 2024, 08:31 PM IST
Summer Tips: వేసవిలో ఈ టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వండి.. లేదా ఆరోగ్య సమస్యలు తప్పవు..

Summer Health Hacks: మిగతా సీజన్లతో పోలిస్తే వేసవికాలంలో ఎక్కువ మంది అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. దానికి కారణం సమ్మర్ అయినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోకుండా సూర్యుడి వేడి ప్రతాపాన్ని తట్టుకుంటూ.. మనం కూడా మన జీవన శైలిని మార్చుకోవాల్సి ఉంటుంది. అందుకనే వేసవికాలంలో కచ్చితంగా మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. 

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. వేసవికాలంలో వేడి తాపం వల్ల.. మన ఆరోగ్యం పాడవకుండా మన జాగ్రత్తల్లో మనం ఉండటం మంచిది. బయట ఎండ మండిపోతున్నా కూడా కొన్ని చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవ్వడం వల్ల మన శరీరం మాత్రం కూల్ గా ఉంటుంది. శరీరాన్ని కూల్ చేసే కొన్ని మార్గాలను తెలుసుకుందాం.

వేడి నీళ్లతో స్నానం చేయడం: 

అసలే వేసవికాలం కాబట్టి చాలామంది చన్నీళ్లతోనే స్నానం చేసేస్తూ ఉంటారు. రోజుకి రెండు మూడుసార్లు చేసినా లేదా ఒకసారి చేసినా కూడా.. వేడి నీళ్లతో చేస్తే ఆరోగ్యానికి మంచిది. అలా అని పొగలు కక్కుతున్న నీళ్లతో కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉండే.. నీటితోనైనా స్నానం చేయడం వల్ల చర్మాన్ని మెరుగ్గా శుభ్రపరచుకోవచ్చు. 

చర్మాన్ని కాపాడుకోవడం:

వేసవి కాలంలో వేడి వల్ల చర్మం కూడా పొడిబారి పోతూ ఉంటుంది. కాబట్టి దానికి కూడా మనం సంరక్షించుకోవాల్సి ఉంటుంది. శరీరానికి సరిపడా మంచినీళ్లు తాగడం వల్ల చర్మం కూడా పొడిబారి పోకుండా ఉంటుంది. అంతేకాకుండా బయటకు వెళ్తున్నప్పుడు సన్ స్క్రీన్ రాసుకోవడం, కళ్లద్దాలు పెట్టుకోవడం, మంచినీళ్ల బాటిల్ తీసుకువెళ్లడం వంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. 

ఏదో ఒకటి తాగుతూ ఉండటం: 

వేసవికాలంలో చాలా వరకు ప్రజలు డిహైడ్రేషన్ కి గురవుతూ ఉంటారు. అందుకే శరీరానికి ఎక్కువగా నీరు అందించటం చాలా ముఖ్యం. బయటకు వెళ్లినా కూడా వాటర్ బాటిల్ తీసుకెళ్లడం మర్చిపోకూడదు. సమయానుసారంగా మంచినీళ్లు జ్యూస్.. ఇలా ఏదో ఒక విధంగా శరీరానికి సరిపడా పానీయాలను అందిస్తూ ఉండడం వల్ల బిహైడ్రేషన్ మన జోలికి రాకుండా ఉంటుంది

మితంగా తినడం: 

వేసవికాలం కాబట్టి శరీరం త్వరగా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో మన ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది ఎప్పటికప్పుడు మంచినీళ్లు తాగుతూ ఉండటంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిది. అలా అని సమయం దొరికినప్పుడల్లా ఏదో ఒకటి తింటూ ఉండటం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. సమ్మర్ కాబట్టి మితంగా తినడం మంచిది. అప్పుడే జీర్ణవ్యవస్థ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా మెరుగ్గా పనిచేస్తుంది. 

ఎక్కువగా నిద్రపోవడం: 

మనం తినే ఆహారంతో పాటు నిద్ర కూడా ఆరోగ్యం మీద ప్రభావం. కంటి నిండా నిద్ర ఉంటే సగం ఆరోగ్యం కుదుట పడినట్టే అనిపిస్తుంది. అయితే మిగతా సీజన్లతో పోలిస్తే సమ్మర్లో నిద్ర పట్టటం కొంచెం కష్టంగా ఉంటుంది అట. అయినప్పటికీ ఉంటే రోజు మొత్తం చాలా ఎనర్జిటిక్ గా అనిపిస్తుంది. సమ్మర్ అయినప్పటికీ మంచి నిద్ర వల్ల మనశాంతి కూడా లభిస్తుంది.

Also Read: Bakrid Holiday: ప్రజలకు శుభవార్త..  2 రోజులు సెలవులు ప్రకటించిన తెలంగాణ.. ఎందుకంటే..?

Also Read: Exit Polls KCR: గెలిచినా.. ఓడినా తెలంగాణ రక్షణ కవచం బీఆర్‌ఎస్‌ పార్టీ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News