Summer Health Tips: ఏ ఆహారాలు తిన్న జీర్ణం అవ్వడం లేదా? ఈ చిట్కాలతో మలబద్ధకం, అజీర్ణం సమస్యలకు సులభంగా చెక్!

Summer Health Tips: వాతావరణం లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరగడం కారణంగా చాలామందిలో జీర్ణక్రియ సమస్యలతో పాటు మలబద్ధకం సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ ఇంటి చిట్కాలను పాటించండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 4, 2023, 05:33 PM IST
Summer Health Tips: ఏ ఆహారాలు తిన్న జీర్ణం అవ్వడం లేదా? ఈ  చిట్కాలతో మలబద్ధకం, అజీర్ణం సమస్యలకు సులభంగా చెక్!

Summer Health Tips: భారత్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా చాలామంది చల్లగా ఉండే పానీయాలను ఆహారాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం కారణంగా పొట్ట సమస్యల బారిన పడుతున్నారు. ప్రస్తుతం చాలామందిలో మలబద్ధకం, అజీర్ణం, పొట్టలో నొప్పి వంటి చాలా రకాల పొట్ట సమస్యలు వస్తున్నాయి.  కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే ఆహారాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

వేసవిలో పొట్ట సమస్యలు తగ్గడానికి చక్కటి ఆహార చిట్కాలు:
పెరుగన్నం:

ప్రస్తుతం చాలామంది ఎండల కారణంగా అతిగా శీతల పానీయాలను తీసుకుంటున్నారు. ఇలా తీసుకోవడం కారణంగా అజీర్ణం వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు పోవడానికి ప్రతిరోజు పెరుగన్నం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

Also Read: How To Control Diabetes: ఈ మూలికలతో తీవ్ర మధుమేహం ఒక్కరోజులో దిగి రావడం ఖాయం!

మజ్జిగ తాగండి:
పొట్ట నొప్పి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభించడానికి వేసవికాలంలో ఎక్కువగా మజ్జిగ తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా డీహైడ్రేషన్ సమస్యలను తగ్గించేందుకు కూడా మజ్జిగ సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు .

ఓట్స్ తో తయారుచేసిన ఆహారాలు:
వేసవిలో మలబద్ధకం తీవ్ర పొట్ట నొప్పుల నుంచి తగ్గించేందుకు ఓట్స్ తో తయారు చేసిన ఆహారాల కూడా ప్రభావవంతంగా సహాయపడతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చియా విత్తనాలు:
వేసవిలో తరచుగా మలబద్ధకం అజీర్ణం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఆహారంలో చియా విత్తనాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఫైబ‌ర్, ఎంజైమ్స్, విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ పొట్టను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. కాబట్టి వేసవిలో జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వీటిని ట్రై చేయండి.

Also Read: How To Control Diabetes: ఈ మూలికలతో తీవ్ర మధుమేహం ఒక్కరోజులో దిగి రావడం ఖాయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News