Summer drinks for weight loss : వేసవికాలం వచ్చేసింది. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఈ ఎండలకు ఎక్సర్సైజులు ఏమి చేస్తాం.. బరువు ఎక్కడ తగ్గుతామంటూ బాధపడుతూ ఉంటారు. అయితే వేసవికాలంలో బరువుతగ్గడమే సులభం. మనకు వేసవికాలం ఎక్కువగా తినబుద్ధి కాదు. ఈ ఎండలకు ఎక్కువసేపు ఏదో ఒకటి తాగుతూ ఉండాలి అనిపిస్తుంది. మరి ఇలా తాగాలి అన్నప్పుడే కొన్ని డ్రింక్స్ తాగడం వల్ల మనం వేసవికాలం ఈజీగా బరువు తగ్గొచ్చు. మరి ఆ డ్రింక్స్ ఏవో ఒకసారి చూద్దాం.
కొబ్బరి నీళ్లు:
క్యాలరీలు తక్కువగా ఉన్న కొబ్బరి నీళ్లు వేసవికాలం ఎంతో మంచిది. చూడడానికి నీళ్లలాగే ఉన్నా కూడా కొబ్బరి నీళ్లల్లో పోషకాలు మాత్రం దండిగా ఉంటాయి. వేసవికాలంలో కొబ్బరి నీళ్లు పర్ఫెక్ట్ డిటాక్స్ డ్రింక్. ఇవి తాగడం వల్ల బరువు కూడా తగ్గుతామంటున్నారు వైద్య నిపుణులు.
కీరా దోసకాయ జ్యూస్:
కీర దోసకాయ, సొరకాయ, కొత్తిమీరను మిక్సీ పట్టి.. ఆ నాలుగు నుంచి వచ్చిన జ్యూస్ ని ఉదయాన్నే తాగడం వల్ల.. మన శరీరంలో ఉన్న వ్యర్ధాలు అన్ని బయటకు వెళ్ళిపోతాయి. ఇందువల్ల బరువు కూడా సులభంగా తగ్గుతాం.
వాము నీళ్లు:
రాత్రి పడుకునే ముందు గోరువెచ్చటి వాము నీరు తాగడం ఎంతో మంచిది. ఈ నీళ్లు తాగడం వల్ల అజీర్తి, ఎసిడిటీ, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు మన దరిదాపుల్లోకి రావు.
అలోవెరా జ్యూస్:
అలోవెరా జ్యూస్ మన శరీరంలో ఉండే కొవ్వుని బాగా తగ్గిస్తుంది. అలోవెరా జ్యూస్ వల్ల షుగర్ కంట్రోల్ లోకి రావడమే కాకుండా అజీర్ణ సమస్యలు కూడా చాలావరకు తగ్గిపోతాయి.
జీలకర్ర నీళ్లు:
ఉదయాన్నే గోరువెచ్చని జీలకర్ర నీళ్లు తాగితే జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఏవి మన దరికి రావు. ఇలా తాగడం వల్ల జీర్ణశక్తి పెరిగి బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడుతుంది.
నిమ్మకాయ నీళ్లు:
టిఫిన్ తినే అరగంట ముందు నిమ్మకాయ నీళ్లలో కొంచెం తేనె కలుపుకుని తాగితే చాలా మంచిది. ఇలా రోజు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు సులువుగా బరువు కూడా తగ్గిపోవచ్చు.
Also Read: NEET 2024 Paper Leak: నీట్ 2024 పేపర్ లీక్ అయిందా, ఆ కేంద్రంలో విద్యార్ధులకు మళ్లీ పరీక్ష
Also Read: Starliner: కీలక అంతరిక్ష ప్రయోగం నిలిపివేత.. సునీతా విలియమ్స్ రికార్డుకు బ్రేక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter