Sunflower Seeds Laddu: పొద్దుతిరుగుడు గింజల్లో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో విటమిన్ E, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యం, రక్తపోటు నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడతాయి. ఈ గింజల్లో మన శరీరానికి అవసరమైన మోనోసాచురేటెడ్, పాలీసాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీరంలోని కణాల నిర్మాణానికి కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో సెలీనియం, జింక్ కూడా ఉంటుంది. కాబట్టి వీటిని తినండ వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వీటిని లడ్డూల్లా తయారు చేసుకుని తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
పొద్దుతిరుగుడు గింజలు - 1 కప్పు
బెల్లం - 3/4 కప్పు
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
ఎండుద్రాక్ష - 1/4 కప్పు
జీలకర్ర పొడి - 1/4 టీస్పూన్
కొబ్బరి తురుము - 1/4 కప్పు
తయారీ విధానం:
పొద్దుతిరుగుడు గింజలను వేయించుకోవడం:
ముందుగా ఈ లడ్డూను తయారు చేసుకోవాడానికి ఒక నాన్-స్టిక్ పాన్ తీసుకొని నెయ్యి వేసి వేడి చేయాలి.
కడిగి ఆరబెట్టిన పొద్దుతిరుగుడు గింజలను వేసి కాస్త బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
జాగ్రత్తగా వేయించాలి, ఎక్కువ వేడి చేస్తే గింజలు మాడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.
బెల్లం పాకం:
ఒక మందపాటి బాణలిలో బెల్లం, 2 టేబుల్ స్పూన్ల నీరు వేసి మంట మీద ఉంచాలి.
బెల్లం కరిగి పాకం బాగా పట్టేంత వరకు మరిగించుకోవాల్సి ఉంటుంది.
పాకం ఒక తాడులాగా తీగలాగా వచ్చేటప్పుడు అంటే ఒక నిమిషం వరకు పాకం పట్టుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
లడ్డులు చేయడం:
వేయించిన పొద్దుతిరుగుడు గింజలు, యాలకుల పొడి, ఎండుద్రాక్ష, కొబ్బరి తురుము వంటి అన్ని పదార్థాలను ఒక పాత్రలో కలపాలి.
ఇందులో బెల్లం పాకాన్ని వేసి బాగా కలపాలి.
కలపడం వల్ల గింజలు బెల్లం పాకంతో బాగా అతుక్కుపోతాయి.
ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి లడ్డులు తయారు చేసుకోవాలి.
లడ్డులు చేసిన తర్వాత వాటిని కొబ్బరి తురుములో వేసి రోల్ చేయాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి