Teeth Whitening At Home: పాచి పండ్లను తెల్లని ముత్యాల మార్చడానికి చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇవి పాచిగా మారడానికి అనేక రకాల కారణాలుండడం విశేషం.. ముఖ్యంగా వేసవి కాలంలో అధికంగా శీతల పానీయాలను, కాఫీలను విచ్చల విడిగా తాగడం వల్ల ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు నోటిని శుభ్రం చేసుకోకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఈ సమస్యతో ప్రతి నలుగురిలో ఒకరు బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య ఉన్నవారు గుంపులో మాట్లాడేందుకు చాలా ఇబ్బంది పడతారు. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి చాలా రకాల చిట్కాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
దంతాలను తెల్లగా చేకునేందుకు కావాల్సిన పదార్థాలు:
#అరటి పండు
#ఉప్పును
#పావు టీ స్పూన్ పసుపును
# టూత్ పేస్ట్
పైన పేర్కొన్న వస్తువులను తీసుకోవాలి. దీని కోసం ముందుగా ఒక అరటి పండును తీసుకుని దాని నుంచి తొక్కను తొలచి వేయాలి. ఆ తర్వాత తొక్కకుండే తెల్లని గుజ్జును గిన్నెలో తీసుకుని.. అందులో ఉప్పును, పావు టీ స్పూన్ పసుపును, టూత్ పేస్ట్ ను వేసి బాగా కలుపుకుని మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. అంతేకాకుండా దీనిని ఒక గంట పాటు పక్కన పెట్టుకొని వాడుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
తయారు చేసిన టూత్ పేస్ట్ మిశ్రమాన్ని ప్రతి రోజూ దంతాలను శుభ్రం చేసే ముందు దీనితో 3 నిమిషాల పాటు పళ్లకు మర్ధన చేయాలి. అంతేకాకుండా దీనిని రాత్రి పడుకునే ముందుకూడా దంతాలకు పట్టిస్తే దంత సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుంగడా దంతాలు ముత్యాలలా మిమిలాడుతాయి. ముఖ్యంగా చిగుళ్లు దృఢంగా మారి.. అన్ని సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ మిశ్రమంలో ఉండే గుణాలు నోట్లో ఉన్న బాక్టీరియాను కూడా తొలగిస్తుంది. దంతాలును బలంగా చేసి చిగుళ్లు, నోటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Also read: Bank Holidays July: జూలై నెలలో బ్యాంక్ పనులుంటే సమస్యే..16 రోజులు సెలవులు, ఇదే సెలవుల జాబితా
Also read: Bank Holidays July: జూలై నెలలో బ్యాంక్ పనులుంటే సమస్యే..16 రోజులు సెలవులు, ఇదే సెలవుల జాబితా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook