Remedies For Urine Infections: వేసవికాలంలో చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అందులో ముఖ్యంగా యూరిన్ ఇన్ఫెక్షన్లు ఒకటి. ఈ సమస్యకి ముఖ్య కారణం ఎండలో శరీరానికి తగినంత నీరు తీసుకోకపోవడం. అలాగే వేడి చేసే ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల ఈ సమస్య కలుగుతుంది. అయితే ఈ సమస్య నుంచి బయట పడాలనుకుంటే కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.
యూరిన్ ఇన్ఫెక్షన్ కి కారణం శరీరానికి తగినంత నీరు తీసుకోకపోవడం వల్ల యాసిడ్ రిలీజ్ అవుతాయి. దీని కారణంగా మంట, నొప్పి వంటి సమస్యలు కలుగుతాయి. ముఖ్యంగా వేసవికాలంలో ఈ సమస్య వేధిస్తుంటుంది. అయితే ఈ సమస్యకు నుంచి ఉపశమనం పొందాలి అంటే మొదటి పని అధికంగా నీరు తీసుకోవడం అలాగే వేడి చేస ఆహారాలు తీసుకోకుండా ఉండడం మంచిది. వీటికి బదులుగా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, బార్లీ నీళ్లు, సబ్జా నీళ్లు వంటివి తీసుకోవడం వల్ల మూత్రం సమయంలో మంట కలిగే సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా STIsలు యూరిన్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతాయి. అలాగే మూత్రం వచ్చినప్పుడు వెంటనే మూత్ర ఖాళీ చేయండి. ఎక్కువసేపు మూత్రాన్ని ఉంచడం వల్ల బ్యాక్టీరియా పెరుగుదలకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది. మీరు మూత్ర విసర్జన తర్వాత లైంగిక కార్యకలాపాల తర్వాత ఎల్లప్పుడూ ముందు వెనుక భాగాలను శుభ్రం చేసుకోవడం చాలా అవసరం.
అంతేకాకుండా ఆల్కహాల్ కూడా తీసుకోవడం మానుకోవాలి. దీని వల్ల కూడా యూరిన్ మంట కలిగిస్తుంది. మీరు తరచు కాఫీ, టీలు ఎక్కువగా తీసుకుంటే వాటికి కూడా దూరంగా ఉండటం చాలా మంచిది. లేకుంటే శరీరం డిహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. మీరు వేసవికాలంలో కాటన్ దుస్తులు ధరించడం చాలా ముఖ్యం దీనివల్ల శరీరంలో ఉండే చెమట బయటకి పోతుంది. మీరు ఎల్లప్పుడూ శరీరాన్ని శుభ్రతగా ఉంచడం చాలా అవసరం. రోజుకి రెండు సార్లు స్నానం చేయడం ఉత్తమం. ఉతికిన బట్టలను వేసుకోవాలి అలాగే కాళ్లు చేతులు, మోకాలు వరకు కడుక్కోవాలి. ఈ విధంగా మీరు యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యలను తగ్గించవచ్చు. దీంతోపాటు మీరు ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం అత్యంత ముఖ్యం అందులో ముఖ్యంగా బార్లీ ఇంకా స్ట్రాబెరీ పదార్థాలను తీసుకోవడం చాలా మంచి ఇది యూరినరీ ఇన్ఫెక్షన్ లోనే తగ్గిస్తాయి. ప్రోబయోటిక్స్ మంచి బ్యాక్టీరియాలు ఇవి మూత్ర మార్గంలోని హానికరమైన బ్యాక్టీరియాను అణచివేయడంలో సహాయపడతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి