Top 4 Lipstick Shades: బడ్జెట్‌ ధరలో లభించే టాప్ 4 లిప్‌స్టిక్ షేడ్స్..

Top 4 Lipstick Shades In India: రోజు చాలామంది పెదాలు మంచి లుక్ లో కనిపించేందుకు డిఫరెంట్ లిప్‌స్టిక్‌లను వినియోగిస్తూ ఉంటారు. ఇవి పెదాల అందాన్ని పెంచడమే కాకుండా ముఖాన్ని  గుడ్ లుకింగ్‌తో కనిపించేలా చేస్తుంది. అయితే మహిళలు ప్రస్తుతం ఎక్కువగా వినియోగిస్తున్న టాప్ లిప్‌స్టిక్ ల నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారా?

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 27, 2023, 10:57 PM IST
Top 4 Lipstick Shades: బడ్జెట్‌ ధరలో లభించే టాప్ 4 లిప్‌స్టిక్ షేడ్స్..

 

Top 4 Lipstick Shades In India: మీరు ప్రతిరోజు ఏ రకమైన మేకప్ ను వేసుకున్న దానికి సరిపడా లిప్‌స్టిక్ అంతగా మీరు అందంగా కనిపించకపోవచ్చు. ఎందుకంటే ముఖానికి మేకప్ ఎంత ముఖ్యమో దానికి సరిపడా లిప్‌స్టిక్ కూడా అంతే ముఖ్యం. దీనిని దృష్టిలో పెట్టుకుని చాలా కంపెనీలు ప్రతి ఏటా వివిధ షేడ్స్ లిప్‌స్టిక్‌లను విడుదల చేస్తాయి. ఈ షేడ్స్ చర్మం రంగును బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన  లిప్‌స్టిక్‌లు పెదాల అందాన్ని రెట్టింపు చేసేందుకు కూడా సహాయపడతాయి. అయితే ప్రస్తుతం చాలామంది కొన్ని బ్రాండ్లకు సంబంధించిన లిప్‌స్టిక్‌లనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది వినియోగించే బడ్జెట్ ధరలు లభించే టాప్ 4 లిప్‌స్టిక్‌లను మీకు ఈ రోజు పరిచయం చేయబోతున్నాం.

టాప్ 4 లిప్‌స్టిక్ షేడ్స్:
ప్రతి ఒక్కరు తమ పెదాలను అందంగా తీర్చిదిద్దుకోవడానికి వినియోగించే లిప్‌స్టిక్‌లో మేబెల్లైన్ న్యూయార్క్ బ్రాండ్ కు సంబంధించిన క్రీమీ మ్యాట్స్ కలెక్షన్ ప్రస్తుతం టాప్‌లో ఉంది. ఈ బ్రాండ్‌కు సంబంధించిన లిప్‌స్టిక్‌ల విక్రయాలే ఎక్కువగా జరిగాయని ఇంటర్నెట్ సెర్చింగ్ ద్వారా తెలుస్తోంది. ఇది తక్కువ బడ్జెట్‌లో లభించడంతో యువత ఎక్కువగా ఈ ప్రోడక్ట్‌ను కొనేందుకు ఆసక్తి చూపారని సమాచారం ప్రస్తుతం ఈ లిప్‌స్టిక్‌ ధర రూ.300 నుంచి రూ.700 వరకు ఉంటుందని సమాచారం. 

Nykaa బ్రాండ్ కు మార్కెట్లో ఎంత గుర్తింపు ఉందో అందరికీ తెలిసిందే. అయితే ఈ కంపెనీ ఇటీవలే విడుదల చేసిన స్లీప్ మ్యాట్‌ షేడ్స్ మార్కెట్‌లో మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. ఇవి సాధారణ బడ్జెట్‌లో లభించడంతో ఈ లిప్‌స్టిక్‌ విక్రయాల్లో టాప్ టూలో  నిలిచింది. ముఖ్యంగా ఈ బ్రాండ్ కు సంబంధించిన లిప్‌స్టిక్స్ భారతదేశంలో ఎక్కువగా విక్రయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ బ్రాండ్ కు సంబంధించిన లిప్‌స్టిక్స్ మార్కెట్‌లో ధర రూ.300 నుంచి రూ.800 వరకు ఉంటుంది.

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

పవర్ బుల్లెట్ మ్యాట్ చెప్పనక్కర్లేదు. హుడా బ్యూటీ లిప్‌స్టిక్‌తో ఇప్పటివరకు ఏ బ్రాండ్ పోటీ పడలేదు. హుడా బ్యూటీ పవర్ బుల్లెట్ మ్యాట్ లిప్‌స్టిక్‌ స్పెషాలిటీ ఏమిటంటే ఇది పెదాలకి మెరుపునందించడమే కాకుండా వాటికి రక్షణగా కూడా నిలుస్తుంది. అందుకే దీన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్‌లో  రూ.1,500 నుంచి రూ.2,500 వరకు ధరతో విక్రయిస్తారు.

బాబీ బ్రౌన్ బ్రాండ్ ఈ ఏడాది లక్స్ లిప్ కలర్‌ షేడ్స్ మార్కెట్‌లోకి విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో లభించే బాబీ బ్రౌన్ లక్స్ లిప్ కలర్ కలెక్షన్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇది పెదాలను మృదువుగా ఉంచడమే కాకుండా హైడ్రేట్‌గా ఉంచేందుకు కూడా సహాయపడుతుంది అందుకే ఈ షెడ్ ని ఆన్లైన్‌లో రూ.2,500 నుంచి రూ.4,000 వరకు ధరలతో విక్రయిస్తారు.

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News