Skin Care: ఇంట్లో దొరికే ఈ 5 పదార్థాలతో మెరిసే చర్మం సొంతం చేసుకోవచ్చు

Skin Care: సెప్టెంబర్ ను స్కిన్ కేర్ ఎవేర్నెస్ నెలగా సెలబ్రేట్ చేస్తారు. అందుకే మీ చర్మాన్ని పరిరక్షించుకోవడానికి చిట్కాలు తెలుసుకోవడానికి ఇదే సరైన సమయం. 

Last Updated : Sep 15, 2020, 10:40 PM IST
    • సెప్టెంబర్ ను స్కిన్ కేర్ ఎవేర్నెస్ నెలగా సెలబ్రేట్ చేస్తారు.
    • అందుకే మీ చర్మాన్ని పరిరక్షించుకోవడానికి చిట్కాలు తెలుసుకోవడానికి ఇదే సరైన సమయం.
    • చర్మం ఆరోగ్యకరంగా ఉంటే.. అది మీ లైఫ్ స్టైల్ ను తెలియజేస్తుంది.
Skin Care: ఇంట్లో దొరికే ఈ 5 పదార్థాలతో మెరిసే చర్మం సొంతం చేసుకోవచ్చు

Skin Care: సెప్టెంబర్ ను స్కిన్ కేర్ ఎవేర్నెస్ నెలగా సెలబ్రేట్ చేస్తారు. అందుకే మీ చర్మాన్ని పరిరక్షించుకోవడానికి చిట్కాలు తెలుసుకోవడానికి ఇదే సరైన సమయం. చర్మం ఆరోగ్యంగా (Health) ఉంటే.. అది మీ లైఫ్ స్టైల్ ను తెలియజేస్తుంది. లాక్ డౌన్ వల్ల ఇంట్లోనే అధిక సమయం వెచ్చిస్తోండటంతో చర్మాన్ని పరిరక్షించుకోవడానికి మంచి సమయం దొరికింది. ఈ సమయంలో మనం భానుడి ప్రతాపానికి దూరంగా ఉండవచ్చు... అదే విధంగా పొల్యూషన్ నుంచి కూడా విముక్తి లభిస్తుంది. ఈ సమయంలో మీరు ఈ చిట్కాలు పాటించి చర్మ ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు.

1. బంగాళాదుంప ( Raw Potato ) 
బంగాళాదుంప వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. దీని కోసం బంగాళాదుంపలను గుజ్జుగా చేసి దాన్ని ముఖానికి అప్లై చేసుకోవచ్చు. కొన్ని నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. కళ్లకింద డార్క్ సర్కిల్స్ ను కూడా బంగాళాదుంప నివారిస్తుంది.

2. తేనె+ దాల్చిని ( Honey + Cinnamon )
ముఖంపై మొటిమలు ఉన్నా.. లేదా అయిలీ స్కిన్ అయినా ఈ రెండు పదార్థాలను మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. 5 నిమిషాల తరువాత నీటితో కడిగేయండి.

3. పాలు+ తేనె ( Milk + Honey ):

ఈ కాంబినేషన్ చాలా పవర్ ఫుల్ కాంబినేషన్. దీని వల్ల మీ చర్మం వెలిగిపోతుంది. పాలు (Milk ) చర్మానికి మాయిశ్చరైజర్ లా పని చేస్తుంది. 

4. చందనం ( Chandan ):

చందనం వల్ల చర్మంపై ఉన్న మచ్చలు, డార్క్ సర్కిల్స్ తొలగుతాయి. టాన్ ను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఏజినింగ్ గుణాలు మెండుగా ఉంటాయి. దీనిని దైరక్ట్ గా చర్మంపై పెట్టి తరువాత నీటితో కడిగేయండి. తరువాత కాస్త కలబంద (  Aloe Vera ) జెల్ ను అప్లై చేయండి. 

5. పసుపు ( Turmeric ):

పసుపు వల్ల ఎన్నో ఆరోగ్యకరమై లాభాలతో పాటు చర్మానికి కూడా అది చాలా మంచిది.  దీని వల్ల టానింగ్ తగ్గుతుంది. పసుపు, నిమ్మకాయ, తెనును కలిసి ఒక మిక్స్ గా చేసుకుని ముఖానికి అప్లై చేయండి. అది స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. ఫ్రెష్ గా కనిపించేలా చేస్తుంది.

 

Trending News