Weight Loss In 12 Days: చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా గత కొద్దికాలంగా తక్కువ వయస్సులోనే స్థూలకాయం సమస్య వెంటాడుతోంది. అధిక బరువుకు చెక్ పెట్టాలంటే..ఫిజికల్ వ్యాయామంతో పాటు డైట్‌పై కూడా దృష్టి పెట్టాలి. కొన్ని పదార్ధాలకు చెక్ పెడితే 40 ఏళ్ల వయస్సులో కూడా అధిక బరువును తగ్గించుకోవచ్చు. బరువు ఎప్పుడూ ఆరోగ్యకరమైన పద్ధతిలోనే తగ్గించాలి. డైట్‌లో తగిన మార్పులు చేస్తే ఇది సాధ్యమే.
వయస్సు పెరిగినా బరువు తగ్గించాలంటే ఈ పదార్ధాలకు చెక్ పెట్టాల్సిందే
చాలామంది ఫాస్ట్ ఫుడ్స్ తినడాన్ని ఇష్టపడుతుంటారు. బరువు తగ్గించుకోవాలనుకునేవాళ్లు..ఫాస్ట్‌పుడ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి పదార్ధాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉండదు. ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఆయిల్ పదార్ధాలు అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కేలరీలు పెరిగిపోతాయి. అందుకే బరువు తగ్గించే ఆలోచన ఉంటే ఈ రకమైన పదార్ధాలు మానేయాలి
బేకరీ పదార్ధాలు
సాధారణంగా చాలామంది చాకోలేట్, జామ్, పంచదారతో చేసే పదార్ధాలు బరువును పెంచుతాయి. అందుకే బరువు తగ్గించుకోవాలంటే ఈ పదార్ధాలను డైట్ నుంచి దూరం చేయాలి. ఈ పదార్ధాలు ఎక్కువగా తీసుకుంటే..బాడీలో స్వెల్లింగ్ సమస్య తలెత్తుతుంది. ఫలితంగా శరీర బరువు పెరగుతుంది. అదే ఈ పదార్ధాల్ని డైట్ నుంచి దూరం చేస్తే 40 ఏళ్ల వయస్సులో సైతం అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. బేకరీ పదార్ధాలకు కేవలం స్థూలకాయాన్ని పెంచడమే కాకుండా..చర్మానికి హాని కలిగిస్తాయి.
Also read: Turmeric For Face: ముఖంపై చర్మ సమస్యలేవైనా సరే జస్ట్ 2 రోజుల్లో చెక్.!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook